Begin typing your search above and press return to search.

అనుమానాలు రేకెత్తిస్తున్న సామ్ పోస్ట్.. ఇకపై అతని సమస్య అంటూ!

ఇప్పటికే సమంత తన పెళ్లికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

By:  Madhu Reddy   |   4 Dec 2025 3:48 PM IST
అనుమానాలు రేకెత్తిస్తున్న సామ్ పోస్ట్.. ఇకపై అతని సమస్య అంటూ!
X

అగ్ర కథానాయక సమంత సినీ నిర్మాత రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకొని రాజ్ భార్య అయిపోయింది. ఇప్పటికే సమంత తన పెళ్లికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ.. ఒక ఫన్నీ క్యాప్షన్ పంచుకుంది. అయితే సమంత షేర్ చేసిన ఈ క్యాప్షన్ కొత్త అనుమానాలు పుట్టిస్తుంది. అందులో ఏముందంటే.. సమంత ఇప్పటికే తన పెళ్లి ఫోటోలు ఎన్నో షేర్ చేసింది. అందులో ఒక ఫోటో గురించి ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది.

అందులో సమంత పూలదండ తన చేతిలో పట్టుకొని రాజ్ నిడిమోరుకి వేయడానికి రెడీగా ఉంది. ఆ ఫోటోలో సమంత చేతిలో పూలదండతో పాటు ఆమె మొహంలో చిరునవ్వు ఉట్టిపడుతోంది. అలా చేతిలో పూలదండ పట్టుకొని రాజ్ వైపు తధేకంగా చూస్తూ ఉంది.అయితే ఈ ఫోటోలు షేర్ చేస్తూ "నువ్వు అతని సమస్య అని ఇప్పడినుండి గ్రహించే క్షణం" అంటూ ఒక వెరైటీ క్యాప్షన్ ఇవ్వడంతో పాటు డెవిల్ ఎమోజీని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం సమంత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోతో పాటు ఆమె పెట్టిన ఫన్నీ క్యాప్షన్ కూడా చాలామందిని ఆకర్షించింది.

ప్రస్తుతం చాలామంది సమంత పెట్టిన క్యాప్షన్ చూసి ఇదేంటి సమంత ఇలాంటి పోస్ట్ పెట్టింది.. అది కూడా డెవిల్ ఎమోజీని పెట్టి.. చూస్తుంటే సమంత రాజ్ నిడిమోరుకి ఇప్పటినుండి నీ టైం స్టార్ట్ అయింది అన్నట్లుగా ఒక భార్య భర్తకి ఫన్నీ వార్నింగ్ ఇచ్చినట్టు ఉందిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఇక అసలు సమస్య ఇప్పుడే మొదలైంది అన్నట్లుగా సమంత పోస్ట్ పెట్టిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సమంత, రాజ్ లకి సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ఇదే కాకుండా మరో పోస్టులో సమంత చేతికి పెట్టుకున్న మెహందీలో రాజ్ తన పేరు ఎక్కడ ఉందా అని సెర్చ్ చేస్తున్న ఫోటో కూడా ఉంది. అలా పెళ్లయ్యాక ఎన్నో ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సమంత పెళ్లి విషయానికి వస్తే.. డిసెంబర్ 1న కోయంబత్తూర్ లోని ఈశా ఫౌండేషన్ లో సామ్, రాజ్ ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

వీరి పెళ్లి కోసం చాలా ప్రత్యేకంగా లింగ బైరవి అమ్మవారి టెంపుల్ ని వివాహ వేదికగా ఎంచుకున్నారు. వీరి పెళ్లికి అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లిలో సమంత చిన్న గోధుమ రంగు బంగారు జర్దోజి బార్డర్ గల ఎరుపు రంగు బనారసీ చీరను ధరించగా.. రాజ్ నిడిమోరు టెక్చర్డ్ గోల్డ్ జాకెట్ తో కూడిన ఐవరీ కుర్తా సెట్ ని వేసుకున్నారు..

ఈ జంట ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సీజన్ 2 సమయంలో కలిసారు. అలాగే సమంత చేసిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ సమయంలో వీరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది.అలా గత ఏడాదిలో సమంత , రాజ్ ఇద్దరు డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు స్టార్ట్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి తరచూ వెకేషన్ లకి వెళ్లడం, వివిధ కార్యక్రమాలకు హాజరవ్వడంతో సమంత రాజ్ ల డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ జంటపై ఎన్ని రూమర్లు వినిపించినా కూడా వివాహం చేసుకునే వరకు తమ మధ్య ఉన్న బంధాన్ని బహిరంగంగా ప్రకటించలేదు.