Begin typing your search above and press return to search.

సమంత స్పెషల్ ఫోజ్.. తడి అందాలతో ఉక్కిరిబిక్కిరి!

ఎంత కష్టం ఎదురైనా సరే ఓపికగా ఆ కష్టాన్ని భరిస్తూ.. ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతోంది ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత.

By:  Madhu Reddy   |   23 Feb 2026 8:10 PM IST
సమంత స్పెషల్ ఫోజ్.. తడి అందాలతో ఉక్కిరిబిక్కిరి!
X

ఎంత కష్టం ఎదురైనా సరే ఓపికగా ఆ కష్టాన్ని భరిస్తూ.. ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతోంది ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత. 'ఏ మాయ చేసావే' అనే సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చెన్నై చిన్నది.. మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఇందులో తన అద్భుతమైన నటనతో సింపుల్ లుక్ లో ఆడియన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సమంత.. ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోలుగా పేరు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చి మంచి పేరు దక్కించుకుంది.




కెరియర్ పీక్స్ లో ఉండగానే అక్కినేని హీరో నాగచైతన్యతో ఏడడుగులు వేసింది.. ఏడేళ్ల రహస్య ప్రేమాయణం తర్వాత ఎట్టకేలకు క్యాథలిక్ పద్ధతిలో ఒకసారి..హిందూ పద్ధతిలో మరోసారి రెండుసార్లు వివాహం చేసుకొని.. కొత్త బంధాన్ని ప్రారంభించారు. అయితే ఆ తర్వాత కాలంలో ఏమైందో తెలియదు కానీ పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు . ఆ సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. వ్యక్తిగతంగా ఇబ్బందులు పడింది. పైగా మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే కొంతకాలం గడిపింది కూడా. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె తెలుగులో యశోద, శాకుంతలం, ఖుషీ వంటి చిత్రాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బాలీవుడ్ లో సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ చేసి తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.




ఈ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో చటపటలేసుకొని తిరిగింది . జిమ్ సెంటర్లకు కలిసి వెళ్లడం.. ఒకే ఇంట్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. పైగా ఆయన భుజంపై తలవాల్చి దిగిన ఫోటోలను షేర్ చేసి అనుమానాలు పుట్టించింది. ఇక రూమర్స్ నిజం చేస్తూ 2025 డిసెంబర్లో ఈషా ఫౌండేషన్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధ పద్ధతిలో వివాహం చేసుకుంది సమంత. ఇక పెళ్లయిన నాలుగవ రోజే తన తెలుగు చిత్రమైన మా ఇంటి బంగారం సినిమా షూటింగ్లో పాల్గొని నటన పట్ల తనకున్న నిబద్ధత నిరూపించింది.




ఇకపోతే ఒకవైపు ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరొకవైపు ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ వోగ్ ఇండియా కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇందులో నైటీను తలపించేలా డ్రెస్ ధరించి తడి అందాలతో స్పెషల్ ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు ఇలా తడి అందాలతో ఆకట్టుకుంటూనే మరొకవైపు రెడ్ కలర్ ఫ్రాక్ ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. ఇకపోతే వోగ్ ఇండియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో" వ్యాపారాలలో పెట్టుబడి పెట్టిన విషయం నిజమే కానీ.. నటనకే నా మొదటి ప్రాధాన్యత" అంటూ నటనపై తనకున్న మక్కువను నిరూపించుకుంది. మొత్తానికి అయితే వోగ్ ఇండియా కవర్ పేజీ కోసం సమంత ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.