సమంత క్రేజీ 'మంత్'.. హింట్ ఇచ్చినట్లేనా?
స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 12 Oct 2025 9:01 AM ISTస్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారన్న విషయం తెలిసిందే. నెట్టింట యమా యాక్టివ్ గా ఉండే అమ్మడు.. తనకు సంబంధించిన అనేక విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. తద్వారా తన అభిమానులతో టచ్ లో ఉంటారు. అదే సమయంలో సమంత పోస్టులు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
రీసెంట్ గా ఆమె పెట్టిన పోస్ట్ ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. సమంత షేర్ చేసిన వీడియోలో సమంత షూటింగ్ కోసం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తారు. మొదట సౌకర్యవంతమైన తెల్లటి బాత్రూబ్ లో, ఆ తర్వాత అద్భుతమైన క్రీమ్ కలర్ భారతీయ దుస్తుల్లోకి మారుతారు. ఆమె ఎప్పుడూ లేనంతగా రిలాక్స్ గా, సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు.
అదే సమయంలో వార్డ్ రోబ్ చాలా అర్థవంతంగా మారిందని, గత కొన్ని నెలలు ఉత్తేజకరంగా ఉన్నాయని తెలిపారు.. చాలా కొత్త ఆలోచనలు, కొత్త శక్తులు, విషయాలు నిజంగా రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. దీంతో ఆమె లైఫ్ లో బిగ్ ఛేంజ్ ఉంటుందని క్లియర్ గా తెలుస్తోంది. ఆమె గొంతులోని ఉత్సాహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
క్రేజీ మంత్ అని చెప్పి సామ్ కెమెరా వైపు కన్నుగీటుతారు. అలా తన వచ్చే నెలంతా క్రేజీగా ఉండనున్నట్లు పరోక్షంగా తెలిపారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. సమంత మరికొద్ది రోజుల్లో గుడ్ న్యూస్ చెప్పనున్నారని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అది వచ్చే నెలలో జరగనుందని చెబుతున్నారు.
నిజానికి.. సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు రిలేషన్ షిప్ లో ఉన్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరూ కలిసే కనిపిస్తున్నారు. కలిసే వెకేషన్స్ కు వెళ్తున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ను సమంతనే షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇద్దరూ జిమ్ కు వెళ్లి వస్తున్న వీడియోస్ కూడా వైరల్ గా మారాయి.
కానీ సామ్ గానీ, రాజ్ గానీ తమ రిలేషన్ షిప్ వార్తలపై రెస్పాండ్ అవ్వడం లేదు. కనీసం ఖండించడం లేదు కూడా. దీంతో అందరూ అనుకున్నది నిజమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఆ విషయంలో సామ్ క్లారిటీ ఇస్తారేమోనని అంటున్నారు. అందుకే వచ్చే నెలను క్రేజీ మంత్ గా నెరేట్ చేస్తున్నట్లు ఉన్నారని చెబుతున్నారు.
