సమంత పెళ్లి.. అట్రాక్షన్ గా నిలిచిన డైమండ్ రింగ్.. ఖరీదు, ప్రత్యేకతలు ఏంటంటే?
ఇకపోతే ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవడం చూసాం. ఎంగేజ్మెంట్ రింగులు,వెడ్డింగ్ రింగులు పెట్టుకోవడం చూసాం.
By: Madhu Reddy | 2 Dec 2025 3:49 PM ISTసమంత - రాజ్ నిడిమోరులు ఎట్టకేలకు ఊహగానాలకు తెర దించుతూ డిసెంబర్ 1,2025న వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.కోయంబత్తూర్ లోని ఈషా యోగ సెంటర్లో ఉండే లింగ భైరవి అమ్మవారి సాక్షిగా భూత శుద్ధి ఆచారంలో వివాహం చేసుకున్నారు. ఆ ఫోటోలను సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకోగా.. సమంత - రాజ్ నిడిమోరులకు సంబంధించిన పెళ్లి ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు సమంత కాసేపటి క్రితమే తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన చేతికి పెట్టుకున్న వెడ్డింగ్ డైమండ్ రింగ్ ను హైలెట్ చేస్తూ ఆ ఫోటోలు పంచుకుంది. దీంతో సోషల్ మీడియాలో చాలామంది సమంత పెట్టుకున్న రింగ్ గురించి తెలుసుకోవడానికి తెగ వెతికేస్తున్నారు.
ఇకపోతే ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవడం చూసాం. ఎంగేజ్మెంట్ రింగులు,వెడ్డింగ్ రింగులు పెట్టుకోవడం చూసాం. కానీ సమంత పెట్టుకున్న వెడ్డింగ్ రింగ్ ని లాంటి రింగ్ ను ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ ధరించలేదు. ఇంతకీ సమంత చేతికి పెట్టుకున్న ఆ వెడ్డింగ్ రింగ్ స్పెషాలిటీ ఏంటి..? అనే విషయానికి వస్తే.. ఓ జ్యువెల్లరీ వ్యాపారి సమంత పెట్టుకున్న వెడ్డింగ్ రింగ్ కి సంబంధించిన విషయాలన్నీ బయటపెట్టారు. అంతేకాదు ఈ విషయాన్ని సమంత కూడా షేర్ చేసింది.
ప్రముఖ ప్రెట్ జ్యువెల్లరీ వ్యాపారి అభిలాష బండారి మాట్లాడుతూ.. సమంత తన పెళ్లిలో ధరించిన వెడ్డింగ్ రింగ్ కి చాలా స్పెషాలిటీ ఉంది. ఆ రింగ్ మొఘల్ ల కాలంలో ఎక్కువగా వాడుకలో ఉండేది. ముఖ్యంగా తాజ్ మహల్ ని కట్టించిన షాజహాన్ భార్య ముంతాజ్ కి ఇలాంటి తరహా ఉంగరాలు అంటే చాలా ఇష్టం ఉండేదని చరిత్ర చెబుతుంది.
సమంత తన చేతికి పెట్టుకున్న డైమండ్ రింగ్ పోట్రైట్ కట్ డైమండ్ రింగ్.. డైమండ్ ని ఒక షేపులో కట్ చేసి పలచటి గాజు పలకలా ఇష్టమైన షేపులో తయారుచేస్తారు. ఇక ఈ డైమండ్ రింగ్ తేజస్సు, బలం, స్వచ్ఛమైన స్వభావానికి ప్రతీకగా పిలుస్తారు. దీన్ని ఫస్ట్ టైం మొఘల్ ల కాలంలోనే తయారు చేశారు.ఇలాంటి వెడ్డింగ్ రింగులు ఈ జనరేషన్ లో చాలా అరుదుగా తయారు చేస్తారు" అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు జ్యువెల్లరీ వ్యాపారి..
సమంత పెళ్లిలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిన ఈ వెడ్డింగ్ రింగ్ ఈ ఏడాది జనవరిలోనే సమంత చేతికి కనిపించింది. సమంత చేతికి ఉన్న ఈ రింగుతో కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.అప్పుడే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు పలు రూమర్లు వినిపించాయి.
అయితే సమంత తన పెళ్లిలో పెట్టుకున్న ఈ వెడ్డింగ్ రింగ్ ని ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ కూడా ధరించలేదు. అలా మొఘల్ ల కాలం నాటి వెడ్డింగ్ రింగ్ ని మళ్లీ రీ స్టైల్ చేసిన సెలెబ్రెటీగా సమంత పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.
అలాగే ఈ వెడ్డింగ్ రింగ్ కాస్ట్ దాదాపు 1.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక గతంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ రాచరికపు స్ఫూర్తితో నీలం రంగులో ఉండే రింగుని తన పెళ్లిలో ధరించింది. అలాగే ప్రియాంక చోప్రా క్లాసిక్ కుషన్ కట్ రాక్ రింగ్, అలియా భట్ ఓవల్ షేప్ డైమండ్ రింగ్ ని ధరించారు. వీరందరికంటే సమంత చాలా వెరైటీగా తన పెళ్లి కోసం రింగ్ ని డిజైన్ చేయించుకుంది.
