Begin typing your search above and press return to search.

తప్పు ఎవరిదైనా శిక్ష ఆడదానికేనా.. సమంత సూటి ప్రశ్న?

లైంగిక వేధింపులకు గురైన మహిళలనే సమాజం విమర్శిస్తోందని, వేధింపులకు పాల్పడిన వారిని ఎందుకు ప్రశ్నించడం లేదని సమంత నిలదీసింది. ఒంటరి తల్లులను తప్పుబడతారు కానీ బాధ్యత లేని తండ్రులను విమర్శించరని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. మహిళల పట్ల సమాజం చూసే దృక్పథంలో మార్పు రావాలని ఆమె చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.

By:  Madhu Reddy   |   17 Nov 2026 4:03 PM IST
తప్పు ఎవరిదైనా శిక్ష ఆడదానికేనా.. సమంత సూటి ప్రశ్న?
X

మాతృత్వపు క్షణాలను ఆస్వాదించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమంత.. త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే బేబీ బంప్ ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ సమంత తన పని తాను చేసుకుంటూ మరొకవైపు బిడ్డ రాక కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి ఈమె ఒకవైపు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. ఎన్నో విషయాలను పంచుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఇండస్ట్రీలో అలాగే సమాజంలో ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ ఈమె ప్రశ్నించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అంటే పబ్లిక్ కాబట్టి ఈ ఇండస్ట్రీలో ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ఆడవారికి ఒక సినిమా రంగంలోనే కాదు.. ఎక్కడా భద్రత లేదు అనే కామెంట్లు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఆడవారి పట్ల, ప్రపంచం చూస్తున్న తీరు పట్ల సమంత ప్రశ్నించిన తీరు అందర్నీ ఆలోచింపజేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.. "మనం నివసిస్తున్న ఈ ప్రపంచంలో లైంగికంగా ఇబ్బంది పడ్డవారినే విమర్శిస్తారు. కానీ ఆ లైంగిక వేధింపులకు పాల్పడిన వారి పట్ల ఎవరూ ప్రశ్నించరు. పైగా ఒంటరిగా ఉన్న తల్లులనే విమర్శిస్తారు.. కానీ బాధ్యత లేని తండ్రులను విమర్శించరు" అంటూ సమాజంలో ఆడవారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తనదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేసింది. మొత్తానికి అయితే సమంత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఎక్కడ ఏదైనా తప్పు జరిగింది అంటే.. అందులో ముఖ్యంగా ఆడవారిని ఎక్కువగా పాయింట్ అవుట్ చేసి చూపించడం సాధారణం అయిపోయింది. ఇబ్బంది ఎవరు ఎదుర్కొన్నా సరే.. ఇబ్బంది పడ్డ వారినే అంటారు కానీ ఇబ్బంది పెట్టిన వారిని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ఈ విధానంలో కచ్చితంగా మార్పు రావాలి అంటూ పలువురు నెటిజన్స్ కూడా ఈమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలు వైరల్ గా మారుతున్నాయి.

నిర్మాతగా మారి ప్రేక్షకులను మెప్పించిన సమంత.. మరొకవైపు హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఈమె.. సోనీ లీవ్ లో ప్రసారమయ్యే సెలబ్రిటీ మాస్టర్ తమిళ్లో సెలబ్రిటీ జడ్జ్ గా కనిపిస్తోంది. ఇకపోతే ఈమె రక్త బ్రహ్మాండం:ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ లో నటించాల్సి ఉంది. కానీ ప్రెగ్నెన్సీ కారణంగానే ఈ సినిమా వాయిదా పడింది. ఇకపోతే ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సమంత.. ఈ సినిమా సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై మేకర్స్ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.