Begin typing your search above and press return to search.

సమంత స్టామినా చూశారా.. సో స్ట్రాంగ్!

ఇటీవల సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ జిమ్ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

By:  M Prashanth   |   29 July 2025 12:56 PM IST
సమంత స్టామినా చూశారా.. సో స్ట్రాంగ్!
X

సమంత రూత్ ప్రభు.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకున్న టాలెంటెడ్ హీరోయిన్. కెరీర్ ప్రారంభం నుంచే హెల్తీగా కనిపించిన సమంత, అ మధ్య కొంత ఇబ్బంది పడింది. ఇక ఇప్పుడు అయితే ఫిట్‌నెస్‌కు మరో అర్థం తీసుకొచ్చారు. సినిమా అవకాశాల పరంగా, గ్లామర్ పరంగా మాత్రమే కాదు… ఆరోగ్య పరంగా కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తున్నారు. తన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కూడా ఎప్పటికప్పుడు హైలెట్ అవ్వడం విశేషం.

వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకోవడంలోనే కాదు, ఫిట్నెస్ విషయంలో కూడా సమంత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో తన వర్కౌట్ వీడియోలు, హెల్త్ టిప్స్, డైట్ సీక్రెట్స్ కూడా తరచూ షేర్ చేస్తూ, ఫాలోవర్స్‌కు స్ఫూర్తినిస్తారు. ఎలాంటి రొటీన్‌ని ఫాలో అవుతున్నారో, కొత్తగా ఏం ట్రై చేస్తున్నారో అప్పుడప్పుడు వీడియోల ద్వారా అందరితో పంచుకుంటారు.

ఇటీవల సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ జిమ్ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆమెతో పాటు ఇద్దరు ట్రైనర్లు ఉన్నారు. ముగ్గురు హ్యాంగింగ్ బార్‌కి వేలాడుతూ, జిమ్‌లో ఒక కొత్త లిఫ్ట్ ప్రయత్నించారు. తమ శరీరాన్ని చేతుల ఆధారంగా పైకి లేపాల్సిన ఈ వర్కౌట్ ఎంతో డిఫికల్ట్‌గా ఉండటమే కాదు, స్టామినా, పట్టుదల ఉంటేనే చేస్తారు. ఇది సమంత సాధారణంగా చేసే రొటీన్ కాదు, ఛాలెంజ్ మోడ్‌లో చేసిన స్పెషల్ వర్కౌట్.

వీడియోలో సమంత ఫోకస్‌డ్‌గా కనిపించడం స్పెషల్ హైలైట్. ట్రైనర్లు కూడా పోటీపడుతూ చేసిన ఈ హ్యాంగింగ్ మువ్ ఎంతో డిమాండింగ్‌గా కనిపించింది. ఫిట్‌నెస్ మీద సమంత ఇంత డెడికేషన్ చూపించడమే కాదు, తన ఛాలెంజ్‌లను, ఫెయిల్యూర్స్‌ను, విజయాలను నిస్సహాయంగా షేర్ చేయడం ఆమెలో ఉన్న నిజాయితీకి నిదర్శనం.

ఇప్పటికే మయోసైటిస్ నుంచి కోలుకుని మళ్లీ ఫుల్ ఎనర్జీతో పని చేస్తున్నారు సమంత. కెరీర్ పరంగా కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌కి సిద్ధమవుతున్నారు. ఇటీవల నిర్మాతగా మారి ‘శుభం’ సినిమాతో చిన్న క్యామియో రోల్ చేశారు. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే రెండో ప్రొడక్షన్‌తో రాబోతున్నారు. ఈ పోస్టర్ ఇప్పటికే నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.