బాలీవుడ్ కార్పోరేట్ సంస్థతో సమంత డిస్కషన్స్.. ఎందుకంటే?
ఈ సినిమాకు సమంతతో ఓ బేబీ లాంటి సూపర్ హిట్ మూవీని తీసిన నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 11 Nov 2025 3:00 AM ISTసౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నేళ్లుగా ఎవరూ ఊహించని పనులే చేస్తూ వస్తున్నారు. పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ తో మొదలుపెట్టి ఆ తర్వాత ఉన్నట్టుండి సినిమాలకు బ్రేక్ ఇవ్వడం, కంబ్యాక్ ఇచ్చాక బాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఎక్కువగా నటించడం ఇలా తన ప్రతీ డెసిషన్ అందరికీ షాకిస్తూనే ఉన్నాయి. అంతేకాదు, ఇప్పుడు సమంత మరోసారి తన డెసిషన్ తో అందరినీ సర్‌ప్రైజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
గతంలో చేయని జానర్ లో..
సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో రూపొందుతుందని, ఈ సినిమాను సమంత గతంలో ఎన్నడూ చేయని జానర్ లో చేస్తున్నారని సన్నిహిత వర్గాలంటున్నాయి. కంబ్యాక్ తర్వాత కథల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సమంత, మా ఇంటి బంగారంతో కొత్తగా ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆడియన్స్ ఉత్సాహంగా ఉన్నారు.
పాన్ ఇండియా క్లబ్ లో నిలపాలని ప్రయత్నాలు
ఈ సినిమాకు సమంతతో ఓ బేబీ లాంటి సూపర్ హిట్ మూవీని తీసిన నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ బేబీ మూవీ లానే మా ఇంటి బంగారం కూడా ఫీమేల్ సెంట్రిక్ సినిమాగానే రాబోతుంది. కాకపోతే ఆ సినిమా కంటే భారీగా, ఫాంటసీ, ఎమోషన్స్, ఆధ్యాత్మికత ను టచ్ చేస్తూ మా ఇంటి బంగారం ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మధ్య టాలీవుడ్ లో హనుమాన్, కార్తికేయ2, మిరాయ్ లాంటి సినిమాలు ఎక్కువవుతుండటంతో ఇప్పుడు సమంత కూడా ఆ క్లబ్ లో చేరి మా ఇంటి బంగారం మూవీని పాన్ ఇండియా మూవీగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే సమంత దీని కోసం ఓ బాలీవుడ్ కార్పోరేట్ సంస్థతో డీల్ కోసం డిస్కషన్స్ కూడా జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఈ మూవీలో గుల్షన్ దేయ్య, దిగంత్, గౌతమి, యాంకర్ కం యాక్టర్ మంజూష లాంటి క్రేజీ క్యాస్టింగ్ కూడా భాగమవుతున్నారు. మా ఇంటి బంగారం మూవీకి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాధ్యతల్ని చూసుకుంటుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే సమంత మా ఇంటి బంగారం మూవీని చాలా భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది.
