ట్రోలింగ్, కామెంట్స్ స్వీకరించే దమ్ముండాలి!
సోషల్ మీడియా యుంగంలో ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్లు సహజం. ఒక పోస్ట్ పై రకరకాల కామెంట్లు పడుతుంటాయి.
By: Srikanth Kontham | 13 Sept 2025 2:00 PM ISTసోషల్ మీడియా యుంగంలో ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్లు సహజం. ఒక పోస్ట్ పై రకరకాల కామెంట్లు పడుతుంటాయి. అందులో నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది. కొన్నిసార్లు పాజిటివ్ కంటే నెగిటివిటీ ఎక్కువగా హైలైట్ అవుతుంది. కింద కామెంట్ బాక్సులో దారుణమైన కామెంట్లు కనిపిస్తుంటాయి. అవి నెట్టింట వైరల్ గానూ మారుతుంటాయి. అయితే వీటిని స్వీకరించే విధానం అన్నది ముఖ్యం. సాధారణంగా పాజిటివ్ కామెంట్లు వస్తే హ్యాపీగా ఫీలవుతారు. అదే చిన్న నెగివిటీ స్ప్రెడ్ అయ్యే సరికి చాలా మంది రకరకాల రియాక్షన్లను తెరపైకి తెస్తుటారు.
కామన్ అయినా కొన్నింటిని సీరియస్ గా:
మరికొంత మంది సున్నిత మనస్కులు మరోలా భావిస్తుంటారు. నెగిటివ్ ఎటాకింగ్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. పాజిటివ్-నెగిటివిటీని బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల వచ్చే సమస్యలే ఇవన్నీ. అయితే స్టార్ హీరోయిన్ సమంత మాత్రం నెగిటివ్ కామెంట్లు వైరల్ అవ్వడం విషయంలోనూ తానెంతో స్ట్రాంగ్ అంటోంది. పాజిటివిటీనే కాదు ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్లను కూడా స్వీకరించినప్పుడే మనలో దమ్మెంతో తెలుస్తుందని అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో నెగివిటీ అనేది కామన్ గా భావించి వదిలేయడం కంటే కొన్ని ముఖ్యమైన విషయాలను తీసుకోవడంలో తప్పులేదంది.
సరిద్దుకునే అవకాశం ఉంటుంది:
వాటి ద్వారా తాము చేసిన తప్పిదాలు బయట పడతాయంది. అన్ని చెత్తా కామెంట్లను పట్టించుకోవాల్సిన పని లేకపోయినా? అర్దవంతంగా ఉన్న కామెంట్లను పిక్ చేసుకుని దొర్లిన తప్పులను సరిదిద్దుకోవడంలో ఎంత మాత్రం తప్పులేదంది. అలా కరెక్ట్ చేసుకోగల్గితే గనుక మరింత స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుందంది. సైకాలజిస్ట్ ల దగ్గరకు వెళ్లినప్పుడు ఇలాంటి విషయాలపై మంచి అవగాహన ఇస్తారని అభిప్రాయపడింది.
సమంత ఎంతో బ్యాలెన్స్ గా:
సోషల్ మీడయాలోకి వచ్చిన కొత్తలో తనకీ నెగిటివ్ కామెంట్ల విషయంలో ఆందోళన కలిగిందని..కానీ కాలక్రమంలో వాటిని అలవాటుగా మార్చుకుని పాజిటివ్ గా ఉండటం అలవాటు చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు తనని మరింత రాటు దేలేలా చేసాయన్నారు. నాగ చైతన్యతో విడాకులు అయిన సమయంలో సమంత సోషల్ మీడియాలో టార్గెట్ అయిన సంగతి లిసిందే. తప్పంతా సమంతదే అన్నట్లు నెట్టింట కామెంట్లు పడ్డాయి. వాటి విషయంలో సమంత ఎంతో బ్యాలెన్స్ గా వ్యవహరించింది.
