Begin typing your search above and press return to search.

ప్రెగ్నెన్సీలో క్యూట్ లుక్.. సమంత ధరించిన ఈ ఫ్రాక్ ఖరీదు ఎంతో తెలుసా?

సమంత సింపుల్ లుక్‌లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ధరించిన పింక్ రఫెల్డ్ మ్యాక్సీ డ్రెస్, సన్ గ్లాసెస్, చెప్పుల ధరలపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ అవుట్‌ఫిట్ ఖరీదు వేల రూపాయల్లో ఉంటుందని ప్రచారం సాగుతోంది. మరోవైపు సమంతకు కవల ఆడపిల్లలు జన్మించారంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండిస్తూ, తనకు ఇంకా డెలివరీ కాలేదని స్పష్టం చేసింది.

By:  Madhu Reddy   |   14 Nov 2026 12:23 PM IST
ప్రెగ్నెన్సీలో క్యూట్ లుక్.. సమంత ధరించిన ఈ ఫ్రాక్ ఖరీదు ఎంతో తెలుసా?
X

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం , అభినయంతో, అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు తొమ్మిదో నెల గర్భంతో అమ్మ అని పిలిపించుకోవడానికి సిద్ధమవుతుండగా.. మరొకవైపు సోనీ విఝాలో తమిళ్ మాస్టర్ చెఫ్ కుకింగ్ సెలబ్రిటీ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది.

దీనికి తోడు ఇటీవల తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ డెలివరీకి సిద్ధమవుతున్నట్టు అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. ఇక అంతలోనే తాజాగా మరో ఔట్ఫిట్ తో పార్లర్ నుండి బయటకు వస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. స్లీవ్ లెస్ ఫ్లేర్డ్ లెంతీ జార్జెట్ ఫ్రాక్ ధరించి పార్లర్ నుండి బయటకు వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇందులో ఈమె ధరించిన అవుట్ ఫిట్ కాస్ట్ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరిచింది.

మరి సింపుల్ లుక్ లో క్యూట్గా కనిపించిన సమంత టాప్ టు బాటమ్ ధరించిన అవుట్ ఫిట్, పెట్టుకున్న గ్లాసెస్, ధరించిన చెప్పులు ఇలా ప్రతి వాటి ధర నెట్టింట వైరల్ గా మారింది.

సమంత ధరించిన ఈ పింక్ రఫెల్ద్ మ్యాక్సీ డ్రెస్ ఖరీదు సుమారుగా రూ.12,000 నుండి రూ.35 వేల వరకు ఉంటుందని సమాచారం. ఇక అలాగే ఈమె పెట్టుకున్న సన్ గ్లాసెస్ ఖరీదు రూ.10 వేల నుండి రూ.35 వేల వరకు ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి కాంబినేషన్లో చక్కటి జుట్టీస్ ను పాదాలకు ధరించింది. వీటి విలువ సుమారుగా రూ.3000 నుండి రూ.12000 వరకు ఉండొచ్చని అంచనా. ఇక తన చేతిలో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఉంది. దీని విలువ అక్షరాల రూ.1,79,900. మొత్తానికి అయితే సింపుల్ లుక్ లో కనిపించినప్పటికీ ఈమె ధరించిన అవుట్ ఫిట్ కాస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇదిలా ఉండగా మరొకవైపు సమంత బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. సమంతకు ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించారంటూ ఒక వార్త తెగ వైరల్ అయింది. అయితే ఈ విషయంపై సమంత స్పందించింది. తాను ఇంకా డెలివరీ కాలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైనా సమంత సింపుల్ నెస్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.