అలా ఆలోచించి తప్పు చేశా : సమంత
సమంత హీరోగా నటించిన సినిమా వచ్చి రెండేళ్లకు పైగానే అయింది. ఈమె చివరిగా 2023లో ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Ramesh Palla | 22 Nov 2025 2:26 PM ISTసమంత హీరోగా నటించిన సినిమా వచ్చి రెండేళ్లకు పైగానే అయింది. ఈమె చివరిగా 2023లో ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఆ సినిమాకు పాజిటివ్ మార్కులు దక్కించుకున్న సమంత నుంచి మరిన్ని సినిమాలను అభిమానులు ఆశించారు. కానీ మయోసైటిస్ అనే అనారోగ్య సమస్య కారణంగా సమంత దాదాపుగా ఏడాది పాటు షూటింగ్స్‌కి పూర్తి దూరంగా ఉంది. ఏకంగా పదుల సినిమాలను ఆమె తిరస్కరించింది అనేది సమాచారం. ఏడాది తర్వాత సమంత తిరిగి కెమెరా ముందుకు వచ్చింది. ఆ గ్యాప్‌లో కూడా సమంత నటించకున్నా ప్రొడక్షన్‌లో ఉంది. ఈ ఏడాదిలో ఈమె శుభం అనే చిన్న సినిమాతో వచ్చింది. సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసిన సమంత ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే.
సమంత డైలీ వర్కౌట్స్..
ప్రస్తుతం ఈమె మా ఇంటి బంగారం అనే సినిమాతో పాటు, ఒక భారీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఒక వైపు షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ సమంత రెగ్యులర్‌గా వర్కౌట్ చేయకుండా మాత్రం ఉండదు. సమంత వర్కౌట్ గురించి గతంలో చాలా మంది ప్రశంసిస్తూ కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజులో ఏదో ఒక సమయంలో సమంత కొంత సేపు అయిన వర్కౌట్స్ చేస్తుందట. సమంత ఈ విషయాన్ని పలు సార్లు చెప్పుకొచ్చింది. బాడీని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం, ఆరోగ్యం కాపాడుకోవడం కోసం సమంత రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల కోసం ఫిజికల్ ఫిట్ నెస్ కోసం సమంత వర్కౌట్స్ చేస్తుంది. సమంత తాజాగా షేర్ చేసిన ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే ఆమె ఈ ఫోటోతో పాటు షేర్ చేసిన విషయం చర్చనీయాంశంగా మారింది.
జెన్యులోపం కారణంగా వెన్నునొప్పి
సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫిజికల్ ఫిట్‌నెస్‌కి సంబంధించిన విషయాలను షేర్ చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం నా వెన్నుముక చాలా వీక్‌గా ఉండేది. నాకు వారసత్వంగా ఆ బలహీనత వచ్చిందని నాకు నేను సరి పెట్టుకున్నాను. ఆ సమయంలో నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నా జెన్యు లోపం కారణంగా ఎప్పుడూ నా వెన్నెముక నొప్పి ఉంటుంది అనుకున్నాను. కానీ ఇతరులను చూసి నేను చాలా ఆశ్చర్యపోయే దాన్ని, వారి యొక్క వెన్నుముక చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో పాటు, వారికి ఎలాంటి నొప్పి లేకపోవడం చూసి ఆలోచన మొదలైంది. ఇన్నాళ్లు నేను తప్పు చేశాను అనిపించింది. నా వెన్నెముక నొప్పిని జెన్యు లోపంగా భావించి తప్పు చేశాను అని సమంత చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి నా వెన్నుముక స్ట్రాంగ్‌గా మార్చుకోవడం కోసం ప్రయత్నాలు చేసినట్లుగా చెప్పుకొచ్చింది.
రెండో వివాహం పై సమంత...
నేను వర్కౌట్ చేయడం మొదలు పెట్టిన సమయంలో చాలా రోజులు ఏ మాత్రం మారడం లేదు అనిపించింది. కానీ మెల్ల మెల్లగా మార్పు అనేది కనిపించింది. కండరాలను నిర్మించుకోవడం చాలా ముఖ్యం అని నాకు అర్థం అయింది. మనం ఎలా కనిపిస్తాము అనేది కాకుండా మనం ఎలా జీవితం సాగిస్తాము అనేది ముఖ్యం. క్రమశిక్షణతో, సహనంతో చేస్తే తప్పకుండా అంతా మంచి జరుగుతుంది అన్నట్లుగా సమంత చెప్పుకొచ్చింది. సమంత ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి పోస్ట్‌లు పెట్టడం ద్వారా ఫిట్ నెస్ విషయంలోనూ సమంత చాలా మందికి ఆదర్శనీయంగా నిలుస్తుంది అంటూ అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు అంటున్నారు. ఇక సమంత వ్యక్తిగత విషయాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సమంత రెండో వివాహం గురించి చర్చ జరుగుతోంది. అందుకు సంబంధించిన అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
