ఇకపై సమంత నిడుమోరు!
సాధారణంగా హీరోయిన్లు పరిచయమైన సమయంలో టైటిల్స్ కార్డులో హీరోయిన్ పేరుతో లేదా పేరు చివరనా తండ్రి పేరుతో కలిపి వేసుకుంటారు.
By: Srikanth Kontham | 25 Jan 2026 10:00 PM ISTసాధారణంగా హీరోయిన్లు పరిచయమైన సమయంలో టైటిల్స్ కార్డులో హీరోయిన్ పేరుతో లేదా పేరు చివరనా తండ్రి పేరుతో కలిపి వేసుకుంటారు. ఇంటిపేరు మాత్రం పెద్దగా వెలుగులోకి రాదు. ఇంటిపేరుతో హీరోయిన్ పేరు అంటే తెలుగు నటీమణుల విషయంలోనే కనిపిస్తుంది. కానీ అదే హీరోయిన్ పెళ్లి అయిన తర్వాత భర్త పేరు లేదా? ఇంటి పేరుతో టైటిల్ కార్స్డ్ లో హైలైట్ అవుతుంది. సమంతను తీసుకుంటే సమంత పెళ్లికి ముందు వరకూ సమంతగానే టైటిల్ కార్స్డ్ లో కనిపించింది. అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత అక్కినేనిగా టైటిల్ కార్స్డ్ లో పడేది.
కొంత కాలం కాపురం అనంతరం విడిపోయే సమయంలో సమంత ఇన్ స్టా గ్రామ్ నుంచి అక్కినేని ని తొలగించి సమంతగా మార్చుకుంది. మొన్నటి వరకూ అలాగే కొనసాగింది. ఇటీవలే బాలీవుడ్ దర్శక, నిర్మాత రాజ్ నిడిమోరును రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై సమంత పేరు సమంత నిడిమోరుగా నెట్టింట ప్రాచుర్యంలోకి రానుంది. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో `మా ఇంటి బంగారం` అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతుంది.
ఈ సినిమాకు మూల కథను అందించింది రాజ్ నిడిమోరు. దీంతో ఈసినిమా టైటిల్స్ కార్డులో సమంత నిడిమోరుగా వెలుగులోకి రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత నటిస్తోన్నది ఈ చిత్రం ఒక్కటే. `ఖుషీ` తర్వాత అమ్మడు నటిస్తోన్న చిత్రం కూడా ఇదే. ఎన్నో బాలీవుడ్ ప్రయత్నాలు చేసి రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడింది గానీ కొత్త అవకాశాలు మాత్రం ఒడిసి పట్టుకోలేకపోయింది. `శుభం` సినిమాతో సమంత నిర్మాతగానూ కొత్త ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. `మా ఇంటి బంగారం` చిత్రం కూడా సమంత నిర్మిస్తోంది.
ఇలా `ఖుషీ` తర్వాత సమంత సొంత బ్యానర్లోనే పని చేస్తోంది. అలాగే హీరోల్ని పెళ్లి చేసుకున్న పలువురు హీరోయిన్లు చూస్తే మహేష్ ను నమ్రత పెళ్లి చేసుకుని ఘట్టమనేని కుటుంబంలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఘట్టమేని కోడిలిగానే ప్రాచుర్యంలోకి వచ్చారు. అలాగే అమల కూడా అక్కినేని నాగార్జునను ప్రేమ వివాహం చేసుకున్న వారే. అలాగే నాగచైతన్య రెండవ వివాహం తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి శోభిత ఇంటిపేరు మారింది. వరుణ్ తేజ్ ని లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుని కొణిదెల కుటుంబంలోకి అడుగు పెట్టింది. ఇంకా ఇలాంటి జంటలు మరికొన్ని ఉన్నాయి.
