Begin typing your search above and press return to search.

స‌మంత మ‌రో స్టార్ కి నో చెప్పిందా?

టాలీవుడ్ - కోలీవుడ్ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఓ వార్త చర్చనీయాంశమవుతోంది.

By:  Srikanth Kontham   |   17 Aug 2026 4:00 AM IST
స‌మంత మ‌రో స్టార్ కి నో చెప్పిందా?
X

టాలీవుడ్ - కోలీవుడ్ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఓ వార్త చర్చనీయాంశమవుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశాన్ని సామ్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో సరసన నటించాల్సిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు సమంత నో చెప్పడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే పట్టాలెక్కేది కాదని, సరిగ్గా ఏడాది తర్వాత ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం పాటు సెట్స్‌లో ఉండాల్సిన ఈ ప్రాజెక్ట్ షెడ్యూల్స్ ... భవిష్యత్ ప్రణాళికలు తన ప్రస్తుత వ్యక్తిగత, వృత్తిపరమైన ఆలోచనలకు సరిపడకపోవడంతోనే సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సామ్ డేట్స్ కేటాయించలేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా సమంత సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న బలమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు. అలాగే స‌మంత‌ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్ట్‌లను అంగీకరిస్తున్నారు. ఏడాది తర్వాత ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పుడే కమిట్ అయితే ఇతర ప్రణాళికలకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే స‌మంత‌ ఈ ఆఫర్‌ను వ‌దులుకుంటుంది అన్న‌ది మ‌రో వెర్ష‌న్.

మరోవైపు అగ్ర నిర్మాణ సంస్థ - స్టార్ హీరో సినిమా కావడంతో సమంత ఈ ఆఫర్‌ను తిరస్కరించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాధారణంగా ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్‌లను నటీనటులు వదులుకోవడానికి సాహసించరు. కానీ సమంత మాత్రం తాను తీసుకునే నిర్ణయాలపై ఎంతో స్పష్టతతో ఉంటానని మరోసారి నిరూపించారు. కథలో కొత్తదనం .. పాత్ర ప్రాధాన్యతను బట్టే అడుగులు వేస్తున్నారని ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది.

ప్రస్తుతం సమంత దృష్టిని వెబ్ సిరీస్‌లు, పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లు , సొంత ప్రొడక్షన్ వెంచర్లపై ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారు. సినిమాల ఎంపికలో సామ్ అనుసరిస్తున్న సెలెక్టివ్ అప్రోచ్ ఆమె కెరీర్‌ను మరింత భిన్నమైన మార్గంలో నడిపిస్తోంది. భారీ ఆఫర్లను సైతం వ్యక్తిగత ప్రాధాన్యతల కోసం పక్కన పెట్టే సమంత‌ తెగింపు ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.

సమంత స్టార్ హీరో సినిమాకు నో చెప్పడం వెనుక కార‌ణాలు ఏవైనా? ఆమె నిర్ణయం ట్రేడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. రాబోయే రోజుల్లో సామ్ ఏ తరహా చిత్రాలను ఎంచుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా? స‌మంత కెరీర్‌ను తన నిబంధనల ప్రకారం నడిపించడంలో ఎప్పుడూ ముందుంటార నడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా స‌మంత ప్ర‌స్తుతం సినిమాల‌న్నింటికంటే మాతృత్వాన్ని ఆస్వ‌దించాల‌నే సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇటీవ‌లే సామ్ గ‌ర్బందాల్చిన నేప‌థ్యంలో బేబికి జ‌న్మ‌నివ్వ‌డానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే.