Begin typing your search above and press return to search.

బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో సమంత? భర్తతో కలిసి పని చేసే ఛాన్స్!

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన స‌మంత రూత్ ప్ర‌భు మరోసారి తన కెరీర్‌లో కీలక దశలో నిలిచారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 March 2026 1:00 AM IST
బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో సమంత? భర్తతో కలిసి పని చేసే ఛాన్స్!
X

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన స‌మంత రూత్ ప్ర‌భు మరోసారి తన కెరీర్‌లో కీలక దశలో నిలిచారు. గత కొంతకాలంగా కొత్త ప్రాజెక్ట్‌ల విషయంలో తొందరపడకుండా, జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటున్న ఆమెకు ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరో భారీ అవకాశం వస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ నటించనున్న ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్ గా సమంత పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత?

ఈ ప్రాజెక్ట్‌పై స్పెష‌ల్ ఇంట్రెస్ట్ పెరగడానికి మరో కారణముంది. ఈ సినిమాను ప్రముఖ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు- డీకే తెరకెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ నిడిమోరుని స‌మంత రీసెంట్ గానే పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ కార‌ణంతోనే ఈ ప్రాజెక్టు మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న భర్త రాజ్ దర్శకత్వంలో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశం ఉండటమే ఈ ప్రాజెక్టుపై అంద‌రికీ ఆస‌క్తిని పెంచుతోంది.

అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సమంతతో ఈ పాత్ర గురించి చర్చలు జరుగుతున్నాయని మాత్రమే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కథకు తగ్గట్టుగా బలమైన మహిళా పాత్ర కావడంతో, సమంత పేరును డైరెక్ట‌ర్లు పరిశీలిస్తున్నారని సమాచారం. గతంలో కూడా ఆమె పాన్ ఇండియా స్థాయిలో తన యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌లో ఆమె ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మే లో మా ఇంటి బంగారం రిలీజ్

ఇక సమంత కెరీర్ పరంగా చూస్తే, ప్రస్తుతం ఆమె నటించిన మా ఇంటి బంగారం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత సమంత మరో పెద్ద ప్రాజెక్ట్‌ను ప్రకటించే అవకాశముందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్‌లో పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం వస్తే, అది ఆమె కెరీర్‌కు మరో కీలక మైలురాయిగా మారే అవకాశముంది.

ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించనున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యాక రాజ్- డీకే ప్రాజెక్టు మొద‌ల‌య్యే అవ‌కాశముంద‌ని, న‌వంబ‌ర్ లో ఈ షూటింగ్ ప్రారంభం కావొచ్చ‌ని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సమంతకు బాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్ దక్కే అవకాశంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజంగా ఈ ప్రాజెక్ట్‌లో ఆమె ఖ‌రారైతే, భర్త దర్శకత్వంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించే అరుదైన కాంబినేషన్‌ను ప్రేక్షకులు విట్‌నెస్ చేయొచ్చు. అదే సమయంలో ఇది సమంత కెరీర్‌లో భారీ రీఎంట్రీగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.