గ్లామర్ కన్నా గ్రేస్ కే.. కవర్ పేజీపై వావ్ అనేలా సామ్
తాజాగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇండియా మార్చి నెల కవర్ పేజీకి ఆమెను ఎంపిక చేయడం విశేషం.. తాజాగా విడుదలైన కవర్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి
By: M Prashanth | 23 Feb 2026 3:26 PM ISTస్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇండియా మార్చి నెల కవర్ పేజీకి ఆమెను ఎంపిక చేయడం విశేషం.. తాజాగా విడుదలైన కవర్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అభిమానులతో పాటు ఫ్యాషన్ ప్రియులు కూడా ఆ ఫిక్స్ ను తెగ షేర్ చేస్తున్నారు.
అయితే వోగ్ ఇండియా ఫొటోషూట్ లో సమంత రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించారు. ఆరెంజ్ కలర్ సెమీ మోడ్రన్ డ్రెస్ లో స్టైలిష్ గా, బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్ లో క్లాసీగా మెరిశారు. సింపుల్ మేకప్, నేచురల్ ఎక్స్ప్రెషన్స్, కాన్ఫిడెంట్ పోజెస్ ఆమెకు మరింత అందం తీసుకొచ్చాయి. గ్లామర్ కంటే గ్రేస్ కు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆ ఫోటో షూట్ లో క్లియర్ గా కనిపిస్తోంది.
కవర్ స్టోరీలో భాగంగా సమంత తన లైఫ్ జర్నీ గురించి మనసు విప్పి మాట్లాడింది. "జీవితంలో పడిపోతే అందరూ చూస్తారు. అది పబ్లిక్ అవుతుంది" అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, విడాకులు, ఆరోగ్య ఇబ్బందులు, సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు అన్నీ తన ముందే జరిగాయని తెలిపింది.
అయితే ఆ కష్టాలు తనను మరింత స్ట్రాంగ్ గా మార్చాయని సమంత చెప్పింది. మొదట్లో బాధ కలిగినా, ఆ తర్వాత మెంటల్ గా స్ట్రాంగ్ గా మారానని వెల్లడించింది. ఇప్పుడు ప్రశంసలు వచ్చినా, విమర్శలు వచ్చినా పెద్దగా ప్రభావం చూపవని స్పష్టం చేసింది. తనపై నమ్మకం పెరిగిందని చెప్పిన సామ్.. ఫిట్ నెస్ పై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వెల్లడించడం విశేషం.
అనారోగ్యంతో కొంతకాలం విరామం తీసుకున్న తర్వాత మళ్లీ బాడీ స్ట్రాంగ్ గా మార్చుకోవడానికి కష్టపడ్డానని తెలిపారు సామ్. రోజూ వ్యాయామం, యోగా, సరైన ఆహారం తీసుకోవడం వల్లే తాను ఆరోగ్యంగా మారానని చెప్పింది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాపార రంగంలోనూ సమంత అడుగులు వేస్తున్నారు.
కొత్త కథలు, కొత్త ప్రాజెక్టులతో ముందుకు సాగాలని భావిస్తున్నట్లు తెలిపింది. కెరీర్ లో ఇది కొత్త దశ అని చెప్పడం గమనార్హం. ఇక కవర్ ఫోటోలు వోగ్ ఇండియా షేర్ చేయగా.. అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. సామ్ చాలా స్ట్రాంగ్, గ్రాండ్ గా కమ్ బ్యాక్ ఇవ్వనున్న అమ్మడు, చాలా ఇన్స్పైరింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఆమె స్టైల్, కాన్ఫిడెన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
