మామ్-టు-బీ వైబ్స్..సమంత యోగా ట్రిప్ హైలైట్
By: Madhu Reddy | 15 July 2026 3:26 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన జీవితంలోనే అత్యంత మధురమైన క్షణాలు ఆస్వాదిస్తోంది. ఇటీవల ఆమె నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సక్సెస్ ఆనందంలో ఉన్న సమంత, ప్రస్తుతం ప్రెగ్నెన్సీ బ్రేక్ తీసుకుని తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి థాయిలాండ్‌లో వెకేషన్‌కు వెళ్ళింది. అక్కడి వెల్‌నెస్ రిసార్ట్‌లో యోగా చేస్తూ, ప్రశాంతమైన సమయాన్ని గడుపుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.
థాయిలాండ్‌లో వెల్‌నెస్ ట్రిప్:
వరుస ప్రమోషన్లు, షూటింగ్‌ల తర్వాత సమంత కాస్త నెమ్మదించి తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. థాయిలాండ్‌లోని హువా హిన్‌లో ఉన్న లగ్జరీ 'చివా-సోమ్' వెల్‌నెస్ రిసార్ట్‌కు తన భర్తతో కలిసి బాబీమూన్ కోసం వెళ్లింది. "వెల్‌నెస్ ట్రావెల్ అంటే నాకు ఎప్పుడూ చాలా ఇష్టం" అంటూ అక్కడి అందమైన వాతావరణాన్ని, సంప్రదాయ థాయ్ ఆర్కిటెక్చర్‌ను చూపిస్తూ సమంత కొన్ని పిక్స్ షేర్ చేసింది.
యోగాతో హెల్తీ మామ్ వైబ్స్:
ప్రతి ఫోటోలో ఆమె స్మైల్ తో ఫాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. ఇక షేర్ చేసిన ఫోటోలలో సమంత యోగా మ్యాట్‌పై కూర్చుని మనఃశాంతితో యోగాసనాలు వేస్తూ కనిపించింది. కంఫర్టబుల్ వర్కౌట్ దుస్తులు ధరించి, బాడీని స్ట్రెచ్ చేస్తూ యోగా ప్రాక్టీస్ చేసింది. ఇక మరో పిక్ లో లేటెస్ట్ పిక్స్‌లో ఆమె బ్లూ-టోన్డ్ ప్రింటెడ్ ట్యూబ్ టాప్, బ్లాక్ ట్రౌజర్స్ ధరించి సూపర్ స్టైలిష్‌గా మరియు ట్రెండీగా మెరిసిపోతోంది. ఇక ఆమె ఇచ్చిన ఈ ఫోజులు, ఆమె ప్రెగ్నెన్సీ గ్లోతో కూడిన ఫ్యాషన్ సెన్స్‌ను హైలైట్ చేస్తూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి..
వర్క్-లైఫ్ బ్యాలెన్స్:
వెకేషన్‌లో సేదతీరుతున్నా కూడా సమంత తన సక్సెస్‌ను ఎంజాయ్ చేయడం మర్చిపోలేదు. ఆమె చేతిలో ఐప్యాడ్ తో ఒక ఫోటో షేర్ చేసింది. అందులో 'మా ఇంటి బంగారం' సినిమా రూ. 100 కోట్ల మైల్‌స్టోన్ సాధించిన పోస్టర్ ఉంది. ఇక నటిగా, సహ-నిర్మాతగా తను సాధించిన ఈ ఘనతను హాలిడేలో చూసుకుంటూ ఆమె మురిసిపోయింది. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఈ రేంజ్ రికార్డు కొట్టడం ఇదే తొలిసారి.
కడుపులోని బిడ్డ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కోసం సమంత తీసుకున్న ఈ యోగా ట్రిప్ నిర్ణయం చాలామందికి స్ఫూర్తినిస్తోంది. "నా ప్రగ్నెన్సీ వల్ల చిన్న గ్యాప్ తీసుకుంటున్నాను.. మెటర్నిటీ లీవ్ తర్వాత మళ్లీ సరికొత్త సినిమాతో మీ ముందుకు వస్తా" అని సమంత ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సూపర్ మామ్-టు-బీ వైబ్స్ ఇలాగే కొనసాగుతూ, ఆమె ఆరోగ్యంగా మాతృత్వాన్ని ఆస్వాదించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
