రిలేషన్‌షిప్ అనేది మన కంట్రోల్‌లో ఉండదు: సమంత
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి బంధాలపై సమాజంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన చర్చ జరుగుతుంటుంది.
By: Sivaji Kontham | 25 Jun 2026 3:04 PM ISTసెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి బంధాలపై సమాజంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన చర్చ జరుగుతుంటుంది. ముఖ్యంగా నేటి తరం యువతకు తమ రిలేషన్‌షిప్స్ విషయంలో ఎలాంటి అవగాహన ఉండాలనే దానిపై స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఒక భాగస్వామిని లేదా మగవాడిని ఎంచుకునే విషయంలో అమ్మాయిలు ఎలా ఆలోచించాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనే దానిపై సామ్ కొన్ని విలువైన సూచనలు చేసింది. మన కెరీర్ లేదా జీవితంలో ఇతర విషయాలైనా మన చేతుల్లో ఉంటాయేమో కానీ, బంధాలు అనేవి కొన్నిసార్లు చాలా క్లిష్టంగా మారుతుంటాయని.. అవి ఎప్పుడూ మన పూర్తి నియంత్రణలో ఉండవని సమంత స్పష్టం చేసారు.
సమంత అభిప్రాయం ప్రకారం.. ఒక రిలేషన్‌షిప్ అనేది విజయవంతం కావాలంటే కేవలం ఒక్కరి వల్ల సాధ్యం కాదు. దానికి ఇద్దరు వ్యక్తులు సమానంగా శ్రమించాల్సి ఉంటుంది. ఒక బంధంలోకి అడుగుపెట్టే ముందు ప్రతి మహిళకు తనపై తనకు నమ్మకం (సెల్ఫ్ కాన్ఫిడెన్స్) ఉండటం అత్యంత ముఖ్యం. వేరొకరిపై ఆధారపడకుండా..ఒక వ్యక్తిగా తనను తాను పరిపూర్ణంగా మార్చుకున్నప్పుడే జీవితంలోకి సరైన భాగస్వామి దొరుకుతాడని సమంత అభిప్రాయపడ్డారు. అలా కాకుండా మనం ఏదో అసంపూర్ణంగా ఉన్నామని భావిస్తూ.. ఎవరో వచ్చి మనల్ని పరిపూర్ణం చేయాలని చూస్తే అక్కడ పొరపాట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.
ఒకరిపై మరొకరికి అంచనాలు మితిమీరినప్పుడు బంధాలలో సమస్యలు మొదలవుతాయని సమంత పేర్కొంది. మనం ఇన్‌కంప్లీట్‌గా ఫీల్ అవుతూ అవతలి వ్యక్తి కోసం ఎదురుచూసినప్పుడు... వారిపై అంచనాలు భారీగా పెరుగుతాయని... అది ఏమాత్రం కరెక్ట్ కాదని సమంత చెప్పింది. అందుకే బంధాన్ని కోరుకునే వారికి లేదా ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి సమంత ఒక చక్కటి సలహా ఇచ్చారు. మిమ్మల్ని సంతోష పెట్టడం లేదా పరిపూర్ణం చేయడం కోసం అవతలి వ్యక్తి వైపు చూడకుండా.. మొదట మీ అంతట మీరే మానసికంగా పరిపూర్ణంగా మారి... ఆ తర్వాతే రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెడితే ఆ బంధం చక్కగా నిలబడుతుందని సమంత వివరించారు.
మరోవైపు సమంత నటనలో ఇటీవల విడుదలైన `మా ఇంటి బంగారం` చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని (సక్సెస్) నమోదు చేసుకుంది. ఈ సినిమా సాధించిన ఘన విజయం వెనుక సమంత భర్త రాజ్ నిడిమోరు చేసిన కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రచయితగా రాజ్ తన అద్భుతమైన ప్రతిభను జోడించి... సమంత నటనను సరికొత్తగా ఆవిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. కథలో సమంత పాత్రను ఎలివేట్ చేస్తూ.. వైవిధ్యమైన ఫ్యామిలీ యాక్షన్-కామెడీగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం వెనుక భర్తగా... ఒక సాంకేతిక నిపుణుడిగా రాజ్ పడిన శ్రమ.. లాయల్టీ ఈ సినిమా సక్సెస్ మీట్‌లో స్పష్టంగా కనిపించాయి.
సమంత వ్యక్తిగత - వృత్తిపరమైన జీవితంలో రాజ్ ఒక బలమైన పిల్లర్‌లా నిలిచారు. సమంత ప్రతి అడుగులోనూ తన వెంట ఉంటూ, తనను మానసికంగా, వృత్తిపరంగా ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నారు. గతంలో `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ సమయం నుండి మొదలైన వీరి ప్రయాణం..ఇప్పుడు `మా ఇంటి బంగారం` సక్సెస్ వరకు ఎంతో పరిణతితో సాగుతోంది. సమంత కెరీర్ ప్లానింగ్‌లోనూ.. తను తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ రాజ్ వెన్నంటి ఉండి భరోసాని ఇస్తున్నారు. ఒకవైపు భర్తగా ప్రేమిస్తూనే..మరోవైపు భార్య సమంతలోని నటిని మరింత ముందుకు పుష్ చేస్తూ సమంత విజయాల్లో ఆయన భాగస్వామిగా నిలుస్తున్నారు.
