Begin typing your search above and press return to search.

స‌మంత సీమ వంట‌కాలు నేర్చుకుంటుందా?

సమంత వ్య‌క్తిగత జీవితంలో తీసుకుంటున్న మార్పులు - అభిరుచులు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి.

By:  Srikanth Kontham   |   15 July 2026 12:00 AM IST
స‌మంత సీమ వంట‌కాలు నేర్చుకుంటుందా?
X

సమంత వ్య‌క్తిగత జీవితంలో తీసుకుంటున్న మార్పులు - అభిరుచులు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి. నాగ చైతన్యతో వివాహం జరిగిన సమయంలో తనకు వంట చేయడం పెద్దగా రాదని, వంట గదిలో గడపడం కంటే పని మీదనే ఎక్కువ దృష్టి పెడతానని బహిరంగంగానే వెల్ల‌డించారు. తాజాగా అదే స‌మంత మ‌నసంతా వంట‌గ‌దిపైనే ఉంద‌న్న‌ది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్ర‌స్తుతం రాయలసీమ రుచులను నేర్చుకోవడంలో నిమగ్నమైంద‌ని తెలిసింది. రాయలసీమ వంటకాలు అనగానే ఘాటైన మసాలాలు, ప్రత్యేకమైన తయారీ పద్ధతులు గుర్తుకొస్తాయి.

సామ్ సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్ర‌కారం సమంత ఎంతో శ్రద్ధగా ఈ వంటకాలను నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా సీమ రుచుల ప్రత్యేకతను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని తెలిసింది. ఒకప్పుడు వంటకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు ఇష్టంగా వంటగదిలో సమయం గడపడం అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేస్తుంది. సమంత ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలే కారణమని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స‌మంత‌ ఇంటికే పరిమితమై, ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నారు.

గర్భవతి కావ‌డంతో ఈ సమయంలో బయట తిరుగుళ్లు తగ్గించి ఇంట్లోనే ఉండటం ఆమెకు వంటపై ఆసక్తిని పెంచేలా చేసిందని తెలుస్తోంది. ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యుల మధ్య గడపడం కొత్త అనుభూతిని అందిస్తుంద‌ని చెప్పొచ్చు. నటిగా కెరీర్‌లో బిజీగా ఉన్నప్పుడు వంటపై దృష్టి పెట్టడం కుదరకపోవచ్చు. కానీ ఇప్పుడు లభించిన విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వంట కేవలం ఆకలి తీర్చుకోవడం మాత్రమే కాదు. అది ఒక కళ అని దానిని ఆస్వాదిస్తూ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని సమంత కూడా భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఆరోగ్యకరమైన, రుచికరమైన ఇంటి భోజనం గర్భవతిగా ఆమెకు ఎంతో మేలు చేకూరుస్తుంది. తెలుగు వ్యక్తిని వివాహం ( రాజ్ నిడిమోరు) చేసుకున్న తర్వాత సంప్రదాయాలు , రుచులపై స‌మంత‌కు మక్కువ పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు. తెలుగు వంటకాలకు, ముఖ్యంగా సీమ వంటకాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రుచులను స్వయంగా వండి రుచి చూడటంలో ఉన్న తృప్తి వేరే ఏ ఆహారంలోనూ ఉండదు. సమంత వంటకాలను వండి కుటుంబ సభ్యులకు వడ్డించడంలో ఓ కొత్త ఆనందాన్ని పొందుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

ఇటీవ‌లే రిలీజ్ అయిన `మా ఇంటి బంగారం` చిత్రంలో న‌క్స‌లైట్...ఓ ఇంటి కోడ‌లి పాత్ర‌లో ఎలా అరించారో? తెలిసిందే. వంట తెలియ‌ని స‌మంత వంట‌ల్లో స్పెష‌లిస్ట్ అని చెప్పుకుని కుటుంబంలో హైలైట్ అవుతుంది. అది రీల్ సీన్ అయినా? ఇప్పుడు రియ‌ల్ గా రాయ‌ల‌సీమ వంట‌కాలు నేర్చుకుంటూ రియ‌ల్ గానూ అత్తింటి కుటుంబంలో మంచి వంట గ‌త్తెను అనిపించుకుంటోంది.