Begin typing your search above and press return to search.

సమంత ప్రెగ్నెంట్.. బిడ్డను కనడంపై ఊహించని కామెంట్స్!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Madhu Reddy   |   22 Jun 2026 1:00 PM IST
సమంత ప్రెగ్నెంట్.. బిడ్డను కనడంపై ఊహించని కామెంట్స్!
X

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 18వ తేదీన ఈ సినిమా ప్రీమియర్స్ పడగా.. జూన్ 19వ తేదీన థియేటర్లలో సందడి చేసింది.ఇందులో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూనే.. తెలుగింటి కోడలిగా ఆకట్టుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా సరికొత్త లుక్కులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సమంత టీ షర్టు, జీన్స్ లో కనిపించగా.. అందులో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది అంటూ ఒక వర్గం ఆడియన్స్ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు. ఆమె లుక్ చూసి సమంత ప్రెగ్నెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా సమంత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న వేళ గతంలో బిడ్డను కనడంపై ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. సమంత మాట్లాడుతూ.." నేను నా చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డాను. ముఖ్యంగా ఇలాంటి జీవితం గడిపిన ఎవరైనా సరే పిల్లలకు సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. అందుకే నేను కూడా అలాగే ఆలోచించాను. బిడ్డ పుట్టాక కొన్నేళ్లపాటు ఆ బిడ్డను వదిలి ఎక్కడికీ వెళ్ళను. బాగా చూసుకుంటాను. బిడ్డ నా ప్రపంచంగా భావిస్తాను. వర్కింగ్ మదర్స్ అంటే నాకు ఎంతో గౌరవం" అంటూ సమంత తెలిపింది. మొత్తానికైతే ఒకవైపు సమంతా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న సమయంలో సమంత పాత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికైతే నాటి విషయాలను బట్టి చూస్తే సమంత బిడ్డను కంటే మాత్రం కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అవుతుందనే విషయం స్పష్టం అవుతుంది. ఏదేమైనా నిజంగానే సమంత ఒక బిడ్డకు జన్మనివ్వాలని అభిమానులు గట్టిగా ఆకాంక్షిస్తున్నారు.

సమంత వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఇదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. నాలుగేళ్లపాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండి, ఆ తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. వివాహం తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈమె.. ఆ తర్వాత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడి కొంతకాలం ఇండస్ట్రీకి కూడా దూరమైంది. ఇకపోతే మళ్లీ సినిమాలలో రీఎంట్రీ ఇచ్చిన ఈమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి శుభం అనే సినిమాను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయ్యింది.

ఇకపోతే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడిన ఈమె.. ఎట్టకేలకు 2024లో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇక ఇప్పుడు ఈమె భర్త రాజ్ అందించిన కథతో మా ఇంటి బంగారం సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది సమంత. ఈ చిత్రానికి సహానిర్మాతగా కూడా రాజ్ పనిచేశారు.