Begin typing your search above and press return to search.

సామ్ కనిపిస్తే వెంటపడటమే..!

ఐతే సమంత ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోటోలు క్లిక్ అనిపిస్తారు. ప్రెస్ మీట్ లు, సినిమా ప్రమోషన్స్ అయితే ఓకే కానీ ఆమె జిం కి వెళ్లి వస్తుంటే పాపరాజీలు ఆమెను వదలట్లేదు.

By:  Ramesh Boddu   |   28 Sept 2025 11:49 AM IST
సామ్ కనిపిస్తే వెంటపడటమే..!
X

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈమధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. బాలీవుడ్ వెబ్ సీరీస్ లు చేస్తూ వస్తున్న అమ్మడు ఇప్పుడు అక్కడ సినిమాలను కూడా చేయాలని ఫిక్స్ అయ్యింది. తెలుగులో ఛాన్స్ లు రావట్లేదా అంటే వస్తున్నా కూడా సమంతకు నచ్చే కథలు దొరకట్లేదట. ఐతే సమంత ఈమధ్యనే తన ప్రొడక్షన్ ట్రాలాలా బ్యానర్ లో శుభం సినిమా చేసింది. ఆ సినిమాతో అమ్మడు నిర్మాతగా తన లక్ టెస్ట్ చేసుకుంది. కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వకపోయినా శుభం ఒక మంచి ప్రయత్నం అనిపించుకుంది.

సమంత సీరియస్ అయినా కూడా..

ఐతే సమంత ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోటోలు క్లిక్ అనిపిస్తారు. ప్రెస్ మీట్ లు, సినిమా ప్రమోషన్స్ అయితే ఓకే కానీ ఆమె జిం కి వెళ్లి వస్తుంటే పాపరాజీలు ఆమెను వదలట్లేదు. వెంట పడి మరీ ఆమె ఫోటోలు క్లిక్ అనిపిస్తున్నారు. అంతకుముందు ఆల్రెడీ సమంత ఈ విషయంపై కాస్త సీరియస్ అయినా కూడా ఆమెను వదలట్లేదు. మామూలుగా అయితే కొందరు హీరోయిన్స్ ఈ పాపరాజీలను కావాలని పెట్టుకుంటారు. అందుకే వాళ్లు జిమ్, ఎయిర్ పోర్ట్ ఇలా పబ్లిక్ లో ఎక్కడ కనిపించినా ఫోటోస్ తీస్తుంటారు.

కానీ సమంత విషయంలో ఆమె వద్దంటున్నా కూడా వీళ్లు వదలట్లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ డైరెక్టర్ రాజ్ తో సమంత చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది అన్న టాక్ ఉంది. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఎవరు ఈ విషయంపై ఓపెన్ అవ్వట్లేదు. ఐతే రాజ్ తో ముంబైలో సమంత కనిపించిన ప్రతిసారి ముంబై మీడియా తెగ హడావిడి చేస్తుంది.

ఇష్టం లేకుండా ఫోటోలు తీయడం..

లేటెస్ట్ గా ఆమె జిమ్ నుంచి బయటకు వస్తున్న టైం లో కూడా అదే జిమ్ నుంచి రాజ్ కూడా రావడం వల్ల సమంత కనీసం పాపరాజీలను పట్టించుకోకుండా వెళ్లిందట. అయినా సరే సమంత వెంట పడి ఆమెని ఫోటో తీయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. సమంత ఈ విషయంలో చాలా డిజప్పాయింటెడ్ గా ఉందని తెలుస్తుంది. స్టార్స్ అయినా సరే వాళ్లకి ఇష్టం లేకుండా ఫోటోలు తీయడం అన్నది కరెక్ట్ కాదు. చూస్తుంటే ఈ విషయంపై సమంత ఏదో ఒక టైం లో గట్టిగా రియాక్ట్ అయ్యేలా ఉంది.

సమంత సినిమాల విషయానికి వస్తే అమ్మడు బాలీవుడ్ లోనే నెక్స్ట్ సినిమా చేస్తుందని టాక్. తెలుగులో తన బ్యానర్ లోనే మా ఇంటి బంగారం సినిమా లైన్ లో ఉంది. ఆ సినిమా తర్వాత సమంత తెలుగులో కూడా వరుస ప్రాజెక్ట్స్ చేయాలని చూస్తుంది.