Begin typing your search above and press return to search.

రూట్ మార్చిన సమంత.. ప్రెగ్నెన్సీలో కూడా ఈ కష్టం ఎందుకు తల్లీ?

అయితే ఆ బాధలన్నింటిని వెనక్కి నెట్టేసి మళ్లీ భూమిలో నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన మొక్కలా తనను తాను మార్చుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Madhu Reddy   |   4 July 2026 11:07 AM IST
రూట్ మార్చిన సమంత.. ప్రెగ్నెన్సీలో కూడా ఈ కష్టం ఎందుకు తల్లీ?
X

ప్రముఖ పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత 15 ఏళ్ల కెరియర్ తర్వాత తన జీవితంలో సంతృప్తిగా ఉంది అంటూ ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి చేసిన కామెంట్లు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు, మయోసైటీస్ వ్యాధి ఇలా అన్నీ ఆమెను ఒక్కసారిగా చుట్టుముట్టేసాయి. అయితే ఆ బాధలన్నింటిని వెనక్కి నెట్టేసి మళ్లీ భూమిలో నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన మొక్కలా తనను తాను మార్చుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే ఎప్పుడూ అల్లరిగా, అమాయకంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే సమంత.. ఈ మధ్యకాలంలో యాక్షన్ పర్ఫామెన్స్ తో స్టార్ హీరోల రేంజ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ అయినా.. కామెడీ బేస్డ్ అయినా.. తన నటనతో ఆకట్టుకునే ఈమె యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతుంటే థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. సమంత డూప్ లేకుండా యాక్షన్ పర్ఫామెన్స్ తో రెచ్చిపోతుంటే.. స్టార్ హీరోలు సైతం ఆమె నటనను చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాంటి సమంత జీవితంలో ప్రస్తుతం కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది తన ప్రియుడు , ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన ఈమె ఇప్పుడు తల్లి కాబోతోంది.

మా ఇంటి బంగారం సినిమాతో మూడేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించిన సమంత.. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా తాను గర్భవతిని అని అభిమానులతో పంచుకుంది. మెటర్నటీ లీవ్ తీసుకుంటాను.. కొద్దిరోజులు ఇండస్ట్రీకి దూరం అవుతాను అంటూ చెప్పి అభిమానులను నిరాశపరిచిన ఈమె.. ఇటు వెండితెరపై కాకుండా బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు దగ్గరవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సమంత వాస్తవానికి ఒక హీరోయిన్ గానే కాకుండా హోస్టుగా కూడా సక్సెస్ అయ్యింది. గతంలో వచ్చిన సెలెబ్రిటీ టాక్ షో సామ్ జామ్తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు మరొకసారి హోస్ట్ అవతారం ఎత్తనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

సమంత ప్రెగ్నెన్సీ సమయాన్ని కూడా ఖాళీగా గడపకుండా సెలబ్రిటీ టాక్ షో తో సరదాగా గడపాలని చూస్తున్నట్లు సమాచారం.ఈ మేరకు తమిళంలో ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ సోనీ లీవ్ ద్వారా ఈ సెలబ్రిటీ టాక్ షో ఎపిసోడ్ లను చిత్రీకరించబోతున్నారట. ఇక త్వరలోనే సోనీ లీవ్ నుండి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

ఇకపోతే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సమంత ఇప్పుడు మళ్ళీ సెలబ్రిటీ టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించబోతోంది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రెగ్నెన్సీ సమయంలో విశ్రాంతి తీసుకోవాల్సింది పోయి మళ్ళీ ఈ కష్టం ఎందుకు తల్లి అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. మరి సమంత ప్రెగ్నెన్సీ మాతృత్వాన్ని సంతోషంగా ఆస్వాదిస్తూనే మరొకవైపు ఇలా పలువురు సెలబ్రిటీలతో మింగిల్ అవుతూ ఇటు అభిమానులకు మరింత చేరు అవ్వడానికి సిద్ధమయినట్లు సమాచారం.