బంగారమ్ .. గ్లోయింగ్ మామ్.. సమంతపై నెటిజనుల ప్రేమ..!
By: Sivaji Kontham | 26 Oct 2026 10:50 PM ISTసామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే నటి సమంత తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెటిజనులను, అభిమానులను గొప్పగా ఆకట్టుకుంటున్నాయి. పెళ్లయిన తర్వాత వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను ఎంతో చక్కగా సమతుల్యం చేసుకుంటున్న సమంత ముఖంలో ప్రస్తుతం సరికొత్త కళ కనిపిస్తోంది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఈ శుభసమయంలో తను షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సమంత అందం, ఆనందం చూసి నెటిజన్లు `గ్లోయింగ్ మామ్`, `బంగారం` అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ తమ ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు.
ఈ కొత్త పోస్ట్ చూడగానే అభిమానులందరికీ ఒక్కసారిగా సమంత నటించిన క్లాసిక్ పాత్రలు గుర్తుకొచ్చాయి. ముఖ్యంగా మొదటి రెండు ఫోటోలు చూడగానే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఘన విజయం `ఈగ` చిత్రంలోని `బిందు` క్యారెక్టర్ వైబ్స్ మళ్లీ కనిపిస్తున్నాయని కామెంట్ బాక్స్‌లో నెటిజన్లు పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఆ రోజుల్లో వెండితెరపై చూసిన ఆ అమాయకత్వం, స్వచ్ఛమైన అందం ఇప్పటికీ అలాగే ఉన్నాయని చెబుతూ.. సమంత టైమ్‌లెస్ బ్యూటీని, తన సింపుల్ అండ్ క్లాసిక్ లుక్‌ని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నారు.
సినిమాటిక్ జ్ఞాపకాలతో పాటు... సమంత జీవితంలోకి రాబోతున్న ఈ మాతృత్వపు తీపి అధ్యాయంపైనా అభిమానులు తమ ఆప్యాయతను చాటుకుంటున్నారు. కామెంట్ సెక్షన్‌లో `ప్రెట్టీ మమ్మీ`, `గ్లోయింగ్ మామ్` అంటూ ఎంతో ప్రేమగా సంబోధిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంతకు బాబు పుడతాడా లేక పాప పుడుతుందా? అని అభిమానులు ఎంతో ఉత్సాహంగా అంచనాలు వేస్తూ.. తన ఆరోగ్యంతో పాటు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కామెంట్ సెక్షన్‌ను దీవెనలతో నింపేశారు.
మరోవైపు కామెంట్ సెక్షన్ అంతా ఎర్రటి హార్ట్ ఎమోజీలు, దిష్టి తగలకూడదని వేసే ఈవిల్ ఐ సింబల్స్.. మెరిసే స్టార్‌లతో ఎంతో వర్ణరంజితంగా మారింది. `బంగారమ్`, `క్యూట్ డార్లింగ్`, `క్వీన్` అని అభిమానులు పదే పదే పిలుస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమంత సహజసిద్ధమైన సౌందర్యానికి, ఆకర్షణీయమైన శైలికి ముగ్ధులైన ఫాలోవర్స్.. ఆమె ఎప్పుడూ ఇలాగే చిరునవ్వులు చిందిస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిండు మనస్సుతో కోరుకుంటున్నారు.
ప్రస్తుతం తల్లి కాబోతున్న ఆనందం సమంతలో సరికొత్త గ్లో నింపుతోంది. ఇప్పటికే తన బేబీ బంప్‌ను రివీల్ చేయడమే కాకుండా.. సాంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకలను కూడా జరుపుకోవడంతో సమంత చాలా ఆనందంగా కనిపిస్తోంది. దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లాడిన తర్వాత సమంత జీవితంలోకి కొత్త వెలుగులు ప్రవేశించాయి. ఒకవైపు వరుస ప్రాజెక్టులతో కెరీర్‌లో దూసుకుపోతూనే.. మరోవైపు కుటుంబ జీవితంలో రాబోతున్న పండంటి బిడ్డ కోసం ఎదురుచూస్తూ ఈ ప్రత్యేకమైన క్షణాలను సామ్ ఎంతో ఆస్వాధిస్తోంది.
