Begin typing your search above and press return to search.

స‌మంత మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుందా?

కెరీర్ గ్రాఫ్‌ను కొత్త మలుపు తిప్పే దిశగా సమంత తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ లో చర్చకు దారితీస్తోంది.

By:  Srikanth Kontham   |   8 July 2026 10:00 PM IST
స‌మంత మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుందా?
X

సమంత మరో సంచ‌ల‌నం నిర్ణ‌యం తీసుకుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. విజయాలతో దూసుకుపోతున్న స‌మంత కొంత కాలం పాటు కమర్షియల్ మాస్ చిత్రాలకు దూరంగా ఉంటూ పూర్తిగా ఉమెన్ సెంట్రిక్ సినిమాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గ్లామర్ పాత్రలు లేదా స్టార్ హీరోల పక్కన ఉండే పరిమిత పాత్రల కంటే కథలో తానే ప్రధాన శక్తిగా నిలిచే పాత్రలకే అమ్మ‌డు ప్రాధాన్యత ఇవ్వాల‌నుకుంటుంది అన్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కెరీర్ గ్రాఫ్‌ను కొత్త మలుపు తిప్పే దిశగా సమంత తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ లో చర్చకు దారితీస్తోంది.

స‌మంత ప్ర‌యోగాలు కొన్ని విక‌టించినా? న‌టిగా ఆమె స్థాయిని పెంచిన చిత్రాలే గానీ త‌గ్గించిన‌వి కావు. క‌మ‌ర్శియ‌ల్ గా కొన్ని వ‌ర్కౌట్ అయ్యాయి..కొన్ని వ‌ర్కౌట్ అవ్వ‌లేదు త‌ప్ప సామ్ ఇమేజ్ మాత్రం ఎక్క‌డా చెక్కు చెద‌ర‌లేదు అన్న‌ది వాస్త‌వం. ఇటీవ‌లే రిలీజ్ అయిన `మా ఇంటి బంగారం` చిత్రం బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి సమంత సోలో మార్కెట్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. ఈ ఘనవిజయం ఆమెకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా నటించడం వల్ల వచ్చే క్రేజ్ కంటే బలమైన కథను తన భుజాలపై వేసుకొని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ద్వారా వచ్చే గుర్తింపు శాశ్వతమని స‌మంత‌ బలంగా మ్ముతున్నారు.

స‌మంత ఒకే చెబితే? క‌మ‌ర్శియ‌ల్ అవకాశాలెన్నో రెడీగా ఉన్నాయి. కానీ సమంత కావాలనే వాటిని పక్కన పెడుతున్నట్లు సమాచారం. కంటెంట్ ఆధారిత చిత్రాల్లో నటించడం ద్వారా నటిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవాలని భావిస్తున్నారు. తన పాత్ర చుట్టూ కథ తిరుగుతున్నప్పుడు ప్రేక్షకులతో నేరుగా అనుసంధానం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని సామ్ భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఆమెలోని కళాకారిణిని మరింతగా ఆవిష్కరించే ప్రయత్నంగా కనిపిస్తోంది.

ఈ నిర్ణయం వెనుక బాక్సాఫీస్ సమీకరణాల్లో వ‌స్తోన్న‌ మార్పులు కూడా ఓ కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు హీరోలను మాత్రమే కాకుండా కథాబలం ఉన్న చిత్రాలను.. మహిళా ప్రధాన చిత్రాలను ఆదరించడానికి సిద్ధంగా ఉంటున్నారు. సమంత క్రేజ్‌ను పెట్టుబడిగా పెట్టి విభిన్నమైన కథలను ఎంచుకోవడం వల్ల నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ చిత్రాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇది పరిశ్రమలో ఉమెన్ సెంట్రిక్ సినిమాల మార్కెట్ పెరగడానికి కూడా దోహదపడుతోంది.

ఏదేమైనా సమంత తీసుకున్న నిర్ణయం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతోంది. స్టార్ హీరోల చిత్రాల్లో గ్లామర్ డాల్‌గా కనిపించడం కంటే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలనే సామ్ తపన ప్ర‌శంస‌నీయం. రాబోయే రోజుల్లో సమంత ఎంపిక చేసుకునే కథలు ఆమెను ఏ స్థాయికి తీసుకువెళ్తాయో చూడాలి. వెనుక స్టార్ రైట‌ర్ రాజ్ నిడిమోరు భ‌ర్త రూపంలో ఎలాగూ కావాల్సిన స‌హ‌కారం అందిస్తారు కాబట్టి త‌ప్పిదాల‌కు అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి.