సామ్ ముసి ముసి నవ్వుల వెనక మతలబు?
సినీపరిశ్రమలో కథానాయికల తమ మనుగడ పోరాటాన్ని సాగించాలంటే, దానికి చాలా ఎత్తుగడల్ని అనుసరించాల్సి ఉంటుంది.
By: Sivaji Kontham | 24 Dec 2025 9:00 PM ISTసినీపరిశ్రమలో కథానాయికల తమ మనుగడ పోరాటాన్ని సాగించాలంటే, దానికి చాలా ఎత్తుగడల్ని అనుసరించాల్సి ఉంటుంది. ఇక్కడ క్రేజ్ ఉన్నంత కాలం ఒకలా ఉంటుంది. క్రేజ్ పోయిన మరుక్షణం మరోలా మారుతుంది. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత కథానాయికలు కెరీర్ ని విజయవంతంగా కొనసాగించడం అంత సులువేమీ కాదు. అందుకే ఏదో ఒక ఎత్తుగడతో నిరంతరం పబ్లిక్ కి టచ్ లో ఉండాలి. పబ్లిక్ లో తమ క్రేజ్ తగ్గలేదని నిరూపించాలి. మొన్నటికి మొన్న సమంత పబ్లిక్ అప్పియరెన్స్ దీనిని మరోసారి స్పష్ఠం చేసింది. ఒక పబ్లిక్ ఈవెంట్ నుంచి సామ్ వెళుతూ ఉంటే జనం గుంపుగా వచ్చి మీద పడ్డారు. సమంత నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంటే కుర్రకారు హుషారుగా దూసుకొచ్చారు. సెక్యూరిటీ ఉన్నా రక్షణ కొదవైంది. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతోందోననే ఆందోళన నెలకొంది. నిధి అగర్వాల్ ఘటన తర్వాత సమంతకు ఇలా జరగడం చూసాక చాలా మంది పబ్లిక్ ఆందోళనకు గురయ్యారు. కానీ ఆ సమయంలో సమంత క్రేజ్ ఎంతో బయటపడింది.
అయితే సమంత ఆ ఘటన నుంచి బయటపడిన తర్వాత మరోసారి పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఈసారి సామ్ మునుపటిలా హర్రీగా కాకుండా ఎంతో కూల్ గా కనిపించారు. అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న హబ్బీ రాజ్ కార్ లో కూచుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఫ్యామిలీమ్యాన్ దర్శకనిర్మాత రాజ్ ఆ సమయంలో తన సతీమణిని చూసి ముసి ముసిగా నవ్వుకోవడం కూడా కనిపించింది. సమంతకు పెళ్లి తర్వాత కూడా క్రేజ్ తగ్గలేదని అక్కడ షాప్ లాంచ్ ఈవెంట్ చెప్పింది. అదే సమయంలో భర్తతో తన లవ్ లైఫ్ లోను సమంత ఇప్పుడు హ్యాపీ మూవ్ మెంట్స్ ని ఆస్వాధిస్తోంది.
సమంత ఇటీవల ముసి ముసిగా నవ్వుకుంటూ కనిపించడానికి కారణం మారిన ఫేజ్ అనడంలో సందేహం లేదు. పబ్లిక్ లో ఫాలోయింగ్ ఓవైపు, ఫ్యామిలీ లైఫ్ లో జోయ్ మరోవైపు ఈ ముసి ముసి నవ్వులకు కారణం. క్రేజ్ ఉన్నంత వరకూ ఈ గ్లో అలానే ఉంటుంది. దశాబ్ధంన్నర కాలంలో ఏనాడూ తన క్రేజ్ తగ్గకుండా జాగ్రత్త పడటంలో సమంత తనను మించిన వారు లేరని నిరూపించింది. చైతన్యతో పెళ్లి బ్రేకప్ అయ్యాక, పుష్ప చిత్రంలో `ఊ అంటావా..` పాట ఎంపిక వెనక కూడా సమంత తెలివైన వ్యూహాన్ని అనుసరించింది. తనకు కష్టం వచ్చినా, ఆపద వచ్చినా క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదని నిరూపించేందుకు `ఊ అంటావా..` పాట సహకరించింది. గ్లామర్ ని ఎలివేట్ చేసే పాటలో నర్తించడం సరికాదంటూ ఒక సెక్షన్ ట్రోల్ చేసినా కానీ, సమంత తన క్రేజ్ తగ్గకుండా అలా చేసిందనుకోవచ్చు. బ్రేకప్ తర్వాత అన్నిరకాల గందరగోళాల నుంచి బయటపడి, ప్రస్తుతం భర్త రాజ్ తో కలిసి ఈ అందమైన సమయాన్ని ఆస్వాధిస్తోంది. మునుపటి కంటే సామ్ లో గ్లో కనిపిస్తోంది.
సమంత రూత్ ప్రభు భారతీయ పరిశ్రమలోని అగ్రశ్రేణి కథానాయికలలో ఒకరు అనడంలో సందేహం లేదు. సుమారు 15 ఏళ్ల కెరీర్ లో సమంత చాలా ఎత్తుకు ఎదిగింది. నటిగా లక్షలాది మంది హృదయాలను ఏలుతోంది. దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీని ఆస్వాధిస్తున్న మేటి నటిగా మెప్పు పొందుతోంది. దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాతా నటనలో కొనసాగుతూ స్టార్ డమ్ కి డోఖా లేకుండా ముందుకు సాగుతోంది.
ఆ సమయంలో డేట్ మొదలు..
పెళ్లికి ముందు రాజ్ తో ఏడాదిపైగా సామ్ డేటింగ్ లో ఉంది. `ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2` మొదలు వారి మధ్య ఏదో మొదలైందన్న పుకార్లు ఉన్నాయి. శోభితతో ఎక్స్ హబ్బీ నాగచైతన్య పెళ్లి తర్వాత నెమ్మదిగా సామ్ ఓపెనైంది. సోషల్ మీడియాలో రాజ్‌తో సన్నిహిత ఫోటోలను బహిరంగంగా షేర్ చేయడంతో ఆ ఇద్దరి మధ్యా అనుబంధం గురించి చాలా చర్చ సాగింది. ఎట్టకేలకు 2025 లో అధికారికంగా ఈ జంట పెళ్లితో ఒకటయ్యారు.
కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి దేవి నివాసంలో సమంత -రాజ్ పవిత్ర భూత శుద్ధి విధానంలో పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే, సామ్ ప్రస్తుతం రాజ్ & డికెతో కలిసి `రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌డమ్`లో కోసం కలిసి పనిచేస్తున్నారు.
