సినిమాయేనా.. వెబ్ సిరీసా? సమంత రీఎంట్రీ ట్విస్ట్!
సమంత రీఎంట్రీ ‘అభిమన్యు 2’తో ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఈ సీక్వెల్ కోసం ఆమెను సంప్రదించగా, సమంత సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు ‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్, సోనీ లివ్ తమిళ ప్రాజెక్ట్ కూడా ఆమె తదుపరి ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
By: Sivaji Kontham | 29 Nov 2026 2:00 PM ISTస్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మాతృత్వపు మధురిమలను ఆస్వాధిస్తూ ప్రస్తుతం మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్నారు. నవంబర్ 19న భర్త రాజ్ నిడిమోరుతో కలిసి తమ కుమారుడు దేవ్ నిడిమోరుకు జన్మనిచ్చిన సమంత తదుపరి ఏ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తారన్నది ఇప్పుడు దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారింది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. విశాల్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం `అభిమన్యు` (ఇరుంబు తిరై) సీక్వెల్ కోసం దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఇప్పటికే సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సమంత కూడా సానుకూలంగా స్పందించి ఓకే చెప్పారనే గుసగుసలు కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటంతో సామ్ రీఎంట్రీ మూవీ ఇదే అవుతుందా అన్న చర్చ వేడెక్కిస్తోంది. అయితే దీనిపై సమంత కాంపౌండ్ అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని రివీల్ చేయలేదు.
మరోవైపు సమంత తదుపరి చిత్రాల జాబితాను పరిశీలిస్తే.. `అభిమన్యు 2`తో పాటు రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న భారీ ఫాంటసీ-యాక్షన్ వెబ్ సిరీస్ `రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్` కూడా రేసులో బలంగా వినిపిస్తోంది. మెటర్నిటీ బ్రేక్ ప్రకటించడానికి ముందే సమంత ఈ సిరీస్‌లో నటించారు. అంతేకాకుండా జూలై 2026లో తన విరామాన్ని ప్రకటించిన కొద్దిరోజులకే ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ తో ఒక తమిళ ప్రాజెక్ట్ ఉండబోతోందని సమంత స్వయంగా హింట్ ఇచ్చారు. దీంతో థియేట్రికల్ రిలీజ్ పరంగా `అభిమన్యు` సీక్వెల్ ముందుంటుందా లేక డిజిటల్ తెరపై `రక్త్ బ్రహ్మాండ్` లేదా తమిళ ఓటీటీ సిరీస్‌తో ముందుగా సందడి చేస్తారా అనే ఆసక్తి నెలకొంది.
జూన్ 2026లో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన `మా ఇంటి బంగారం` సక్సెస్ మీట్ సందర్భంగా సమంత తన రీఎంట్రీ ప్రణాళికలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసారు. తన పునరాగమనానికి ఎలాంటి కచ్చితమైన డెడ్‌లైన్ పెట్టుకోవడం లేదని.. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాధించిన తర్వాతే ఏదైనా ఒక భారీ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్‌తో తిరిగి వస్తానని పేర్కొన్నారు. అందుకే కథాబలం, తన పాత్రకు ఉండే ప్రాముఖ్యతను బేరీజు వేసుకున్నాకే సమంత షూటింగ్ సెట్స్‌పైకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
అభిమన్యు తొలి భాగంలో తన నటనతో మెప్పించిన సమంత ఇప్పుడు సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అటు భారీ బడ్జెట్ ఫాంటసీ సిరీస్ `రక్త్ బ్రహ్మాండ్` కూడా రేసులో ఉంది. వీటన్నిటి పోటీ నడుమా ఏది ముందు వరుసలో ప్రజల ముందుకు వస్తుంది? అన్నది వేచి చూడాలి.
