Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్ వైట్ లుక్స్‌లో సామ్ మెస్మరైజ్

సమంత రూత్ ప్రభు ప్రతి సారి తన స్టైల్‌తో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది.

By:  M Prashanth   |   25 Aug 2025 8:31 PM IST
బ్లాక్ అండ్ వైట్ లుక్స్‌లో సామ్ మెస్మరైజ్
X

సమంత రూత్ ప్రభు ప్రతి సారి తన స్టైల్‌తో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కూడా అదే రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ గౌన్‌లో కూల్ లుక్‌తో కనిపించిన సమంత, సింపుల్‌గా ఉన్నా స్టైలిష్‌గా నిలిచింది. మేకప్ మినిమల్‌గా, హెయిర్ లూజ్‌గా వదిలేసుకోవడం ఈ లుక్‌ను మరింత సహజంగా చూపించింది.

సమంత కెరీర్‌ గురించి చెప్పాలంటే, 2010లో ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది, రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్‌లతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళంలోనూ అగ్రశ్రేణి నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్‌లో చేసిన పాత్ర ఆమెకు కొత్త గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు కొంత విరామం తీసుకున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. తన ప్రయాణం, వర్కౌట్ క్లిప్స్, వ్యక్తిగత ఆలోచనలను షేర్ చేస్తూ అభిమానులతో అనుబంధం కొనసాగిస్తోంది. ఈ ఫోటోషూట్ కూడా ఆమె ఫ్యాషన్ సెన్స్, లైఫ్ స్టైల్‌పై ఉన్న క్లాస్‌ని మరోసారి చూపించింది.

ఇక సమంత ప్రస్తుతం కొన్ని కీలక ప్రాజెక్ట్‌లలో నటిస్తోంది. శాకుంతలం తర్వాత ఆమె చేసిన ప్రయోగాలు మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, రాబోయే చిత్రాలపై ఇంకా మంచి అంచనాలున్నాయి. బాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లపై కూడా ఆమె దృష్టి పెట్టింది. నటనతో పాటు బ్యూటీ, ఫిట్‌నెస్‌లలోనూ ఇన్స్పిరేషన్‌గా మారిన సమంత, అనేక మంది అభిమానులకి రోల్ మోడల్‌గా నిలుస్తోంది. మొత్తానికి, సమంత షేర్ చేసిన ఈ తాజా ఫోటోలు మరోసారి ఆమె లుక్‌ని హైలైట్ చేశాయి. ప్రస్తుతం ఆమె రక్త బ్రహ్మాండ అనే ప్రాజెక్టులో నటిస్తోంది.