సమంత-రాజ్ క్యూట్ బేబీమూన్ మూమెంట్స్.. ఫ్యాన్స్ ఫిదా!
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన అభిమానులకు ఒక తీపి కబురు అందిస్తూ సోషల్ మీడియాలో పంచుకున్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
By: Madhu Reddy | 19 Aug 2026 3:17 PM ISTప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన అభిమానులకు ఒక తీపి కబురు అందిస్తూ సోషల్ మీడియాలో పంచుకున్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే తల్లికాబోతున్న సమంత, తన ప్రశాంతమైన బేబీమూన్ సమయానికి సంబంధించిన కలర్‌ఫుల్ ఫొటోలను షేర్ చేశారు. ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో వికసించిన ప్రొద్దుతిరుగుడు పూల కాంతుల మధ్య తన బేబీ బంప్‌తో దేవకన్యలా మెరిసిపోతూ ఆమె పంచుకున్న పిక్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.ఆ విశేషాలు చూద్దాం..
సన్ ఫ్లవర్ వెలుగుల్లో సమంత మైమరిపించే లుక్ లేటెస్ట్:
ఫొటోషూట్‌లో సమంత ఎంతో స్టైలిష్‌గా ఉన్న వైట్ నిట్ టాప్, బ్లాక్ ట్రౌజర్ ధరించి కనిపించారు. ఇక సన్‌ఫ్లవర్ ఇన్స్టాలేషన్స్, కలర్‌ఫుల్ స్టార్రీ నైట్ ఆర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తన బేబీ బంప్‌ను చూపిస్తూ ఆమె ఇచ్చిన పోజులు చాలా ఆకట్టుకుంటున్నాయి. ప్రగ్నెట్ కాలంలో ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆనందం, ఆ గ్లో చూసి అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు.
'జస్ట్ అజ్' అంటూ క్యూట్ క్యాప్షన్:
ఈ సంతోషకరమైన క్షణాలను షేర్ చేస్తూ సమంత చాలా సింపుల్‌గా "జస్ట్ అజ్" అని రాసుకొచ్చారు. ఈ ఒక్క క్యాప్షన్‌తోనే తన జీవితంలోకి అడుగుపెట్టబోతున్న కొత్త అతిథి పట్ల ఉన్న అమితమైన ప్రేమను తెలియజేశారు. ఇక అమాయకమైన నవ్వులు, కోజీ మూమెంట్స్‌తో నిండిన ఈ ఫొటోలు సమంత ఇన్‌స్టాగ్రామ్‌లోనే అత్యంత అందమైన పోస్టులలో ఒకటిగా నిలిచిపోయాయి.
నెటిజన్లు, అభిమానుల ఆశీస్సులు:
సమంత షేర్ చేసిన పిక్స్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, సినీ ప్రముఖులు కామెంట్ల రూపంలో ఆమెకు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. "ప్రేమతో నిండిన ఈ ప్రయాణం ఎంతో అందంగా ఉంది", "లవ్ యు సామ్" అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. త్వరలోనే మాతృత్వంలోకి అడుగుపెడుతున్న ఆమెకు అందరూ ఆశీస్సులు అందజేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్:
కెరీర్ పరంగా సమంత ఇటీవలే మా ఇంటి బంగారం చిత్రంతో నిర్మాతగా, హీరోయిన్ గా విజయాన్ని అందుకున్నారు. తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిన ఆమె చేతిలో ప్రస్తుతం మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం వర్క్ సైడ్‌ని పక్కనపెట్టి, తన జీవితంలో వస్తున్న ఈ మధురమైన అధ్యాయాన్ని, మాతృత్వపు తీపి క్షణాలను సమంత ఆస్వాదిస్తున్నారు.
తల్లికాబోతున్న ఈ శుభసమయంలో సమంత ముఖంలో కనిపిస్తున్న కళ, ఆమె పంచుకుంటున్న ఆనందం చూసి ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ఈ కొత్త జీవిత ప్రయాణంలో సమంత సరికొత్త వెలుగులతో, ఆరోగ్యంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
