Begin typing your search above and press return to search.

మా ఇంటి బంగారం లో ముందు బంగారం ఆవిడే!

తాజాగా టాలీవుడ్ స్టార్ నటి సమంత అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి పంచుకున్న ఓ ఆసక్తికరమైన నిజం సినీ వర్గాల్లో .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Srikanth Kontham   |   7 Jun 2026 6:00 PM IST
మా ఇంటి బంగారం లో ముందు బంగారం ఆవిడే!
X

ఒక న‌టుడు లేదా న‌టి కోసం రాసిన క‌థ మరొకరి వద్దకు చేరడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల వెనుక ఇలాంటి ఆసక్తికరమైన కథలు ఎన్నో ఉన్నాయి. నటీనటుల ఎంపికలో జరిగే ఈ మార్పులు కొన్నిసార్లు చిత్రాల జాతకాన్నే మార్చేస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ నటి సమంత అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి పంచుకున్న ఓ ఆసక్తికరమైన నిజం సినీ వర్గాల్లో .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం `మా ఇంటి బంగారం`. ఈ చిత్రాన్ని స‌మంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్ర‌మిది. తాజాగా సమంత ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆశ్చర్యకర విషయాన్ని బహిర్గతం చేశారు. ఈ కథకు తాను మొదటి ఎంపిక కాదని ముక్కుసూటిగా అంగీకరించారు. `మా ఇంటి బంగారం` లో లీడ్ రోల్ కోసం తొలుత‌ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవిని అనుకున్నాం. సాయి పల్లవి నటనకు, ఆమె ఎంచుకునే వైవిధ్యమైన పాత్రలకు పరిశ్రమలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ కథ ఆమెకు చక్కగా సరిపోతుంద నుకున్నా. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయారన్నారు.

దీంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తానే స్వ‌యంగా రంగంలోకి దిగాల్సి వ‌చ్చింద‌న్న విష‌యం స‌మంత మాట‌ల్లో బ‌య‌ట ప‌డింది. `పరిశ్రమలో కొన్నిసార్లు మనం సినిమాలను ఎంచుకుంటాం. కానీ మరికొన్నిసార్లు సినిమాలే మనల్ని ఎంచుకుంటాయి. ఈ సినిమా విషయంలో సరిగ్గా అదే జరిగిందని స‌మంత తెలిపింది. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి తన సినిమాకు మరొక నటి మొదటి ఎంపిక అనే విషయాన్ని ఎలాంటి ఈగో లేకుండా బహిరంగంగా పంచుకోవడం సమంత వ్యక్తిత్వానికి నిదర్శనమని అభిమానులు కొనియాడుతున్నారు.

సాయి పల్లవి వంటి పవర్‌హౌస్ పర్ఫార్మర్ కోసం రాసిన కథ కావడంతో ఈ చిత్రంలో కంటెంట్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో? ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సమంత కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ చిత్రం సమంత కెరీర్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆమె విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. `మా ఇంటి బంగారం` అనే టైటిల్‌లోనే చక్కని ఫ్యామిలీ ఎమోషన్ .. నేటివిటీ కనిపిస్తుండటంతో ఈ చిత్రం సమంత కెరీర్‌లో ఎలాంటి మైలురాయిగా నిలుస్తుందో చూడాలి.