Begin typing your search above and press return to search.

'అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు'.. రెస్పాన్సిబిలిటీపై సామ్ ఇలా!

సినీ కెరీర్‌ లో ఎన్నో కమర్షియల్ హిట్లు అందుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు మాత్రం తన కొత్త మూవీ విషయంలో పూర్తిగా భిన్నమైన అభిప్రాయంతో ఉన్నట్లు చెప్పారు.

By:  M Prashanth   |   15 Jun 2026 7:00 PM IST
అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. రెస్పాన్సిబిలిటీపై సామ్ ఇలా!
X

సినీ కెరీర్‌ లో ఎన్నో కమర్షియల్ హిట్లు అందుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు మాత్రం తన కొత్త మూవీ విషయంలో పూర్తిగా భిన్నమైన అభిప్రాయంతో ఉన్నట్లు చెప్పారు. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టడంతో ఈసారి తనలో ఒత్తిడి, భయం, ఎగ్జైట్మెంట్ అన్నీ కలిసి ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్ లో తెరకెక్కిన మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ.. ప్రమోషన్లలో బిజీ బిజీగా గడుపుతున్న సమంత పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

జూన్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న మా ఇంటి బంగారం చిత్రంపై మాట్లాడిన సమంత.. గతంలో కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు. ఆ సమయంలో నటిగా సెట్స్‌ కు వెళ్లి తన పాత్రను పూర్తి చేయడం వరకే బాధ్యత పరిమితమై ఉండేదని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వివరించింది. మా ఇంటి బంగారంలో తానే ప్రధాన పాత్ర పోషించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించడం వల్ల ప్రతి చిన్న విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వస్తోందని తెలిపారు.

అందుకే ఈసారి కొంత భయం ఉన్నప్పటికీ, అదే సమయంలో కొత్త ఉత్సాహం కూడా కలుగుతోందని పేర్కొన్నారు. కెరీర్‌ లో డెవలప్మెంట్ అనేది ఎప్పుడూ కంటిన్యూ అవ్వాలని సమంత అభిప్రాయపడ్డారు. ఒకే లాంటి జర్నీ కాకుండా కొత్త బాధ్యతలు స్వీకరించడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం వస్తుందని చెప్పారు. అంతే కాదు.. ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ స్టోరీస్ విషయంలో హీరోయిన్ పై సినిమా భారం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

అయితే సమంత కామెంట్స్ చూస్తే.. నటిగా ఉన్న రేంజ్ నుంచి నిర్మాతగా మారిన తర్వాత ఆమె ఆలోచనా విధానంలో వచ్చిన ఛేంజ్ క్లియర్ గా కనిపిస్తోంది. గతంలో హిట్స్, ఫ్లాప్స్ ఎఫెక్ట్ ఒక యాంగిల్ లో ఉంటే.. ఇప్పుడు సినిమా నిర్మాణంలో పార్టనర్ గా ఉండటంతో ప్రతి నిర్ణయం మరింత బాధ్యతను తీసుకొస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే, మా ఇంటి బంగారం మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

ఫ్యామిలీ స్టోరీకి యాక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ రూపొందిన ఆ సినిమా సమంత కెరీర్‌ లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ స్టోరీస్ ను కొత్త యాంగిల్ తో చూపించాలనే ప్రయత్నంతో సినిమా రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా అప్పుడు నటిగా బాధ్యతలు వేరు.. ఇప్పుడు నటి కమ్ నిర్మాతగా బాధ్యతలు వేరు అంటూ సమంత చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఆమె కెరీర్‌ లో మెచ్యూరిటీ, కొత్త స్టేజ్ ను చూపిస్తున్నాయి. మరి ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీతో సమంత ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.