సమంత చేతిలో స్టార్ ఆఫర్స్.. నిజమేనా..?
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ బిజీ అవ్వబోతుంది. సమంత మొన్నటిదాకా మయోసైటిస్ వల్ల బాధపడింది.
By: Ramesh Boddu | 14 Aug 2025 5:00 PM ISTసౌత్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ బిజీ అవ్వబోతుంది. సమంత మొన్నటిదాకా మయోసైటిస్ వల్ల బాధపడింది. దాని నుంచి పూర్తిగా కోలుకుని ఇప్పుడు మళ్లీ సినిమాలకు బిజీ అవుతుంది. ఈమధ్యనే బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సీరీస్ చేసింది సమంత. తెలుగులో తన ప్రొడక్షన్ లో శుభం అంటూ ఓ సినిమా చేసింది అమ్మడు. అందులో కూడా సమంత క్యామియో రోల్ కూడా చేసింది.
స్టార్ ఛాన్స్ లు రావట్లేదా..
ఐతే సమంత తెలుగు సినిమా ఎప్పుడు చేస్తుంది. స్టార్ ఛాన్స్ లు రావట్లేదా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా ఒక అప్డేట్ సమంత ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. సమంత గ్లోబల్ స్టార్ రాం చరణ్ తో ఆడిపాడుతుందట. రామ్ చరణ్ చేస్తున్న పెద్ది సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పుష్ప సినిమాలో సమంత ఉ అంటావా సాంగ్ తో ఊపు ఊపేసింది. ఇప్పుడు మళ్లీ పెద్ది కోసం అలాంటి ఒక స్పెషల్ ఐటెమ్ కు రెడీ అవుతుందని తెలుస్తుంది.
మరోపక్క సమంత కర్తీతో కలిసి సినిమా చేస్తుందని టాక్. కార్తి ఖైదీ 2 లో కూడా సమంత హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయట. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖైదీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో కార్తికి హీరోయిన్ లేదే అన్న భావన కూడా రాకుండా చేశాడు లోకేష్. ఇక ఇప్పుడు ఖైదీ 2 సిద్ధం చేయబోతున్నారు. ఈ సినిమాలో కార్తి సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుందట.
సమంత మళ్లీ టాలీవుడ్ లో బిజీ..
దాదాపు ఈ రెండు ఆఫర్లకు సమంత ఓకే చెప్పేసిందట. అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే లేట్ అని తెలుస్తుంది. సమంత మళ్లీ టాలీవుడ్, కోలీవుడ్ లో బిజీ అయితే మాత్రం మిగతా హీరోయిన్స్ కి టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పొచ్చు. తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి తర్వాత మరో సినిమా చేయలేదు అమ్మడు. ఐతే తన ఓన్ ప్రొడక్షన్ ట్రాలాలా మూవీస్ బ్యానర్ లోనే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. ఆ సినిమా షూటింగ్ అప్డేట్ మాత్రం బయటకు రావట్లేదు.
సమంత కేవలం హిందీ సినిమాలే అక్కడ సీరీస్ లే చేస్తుంది అనుకుంటున్న ఫ్యాన్స్ కి ఆమె చరణ్, కార్తి సినిమాలు సైన్ చేసిందన్న విషయం తెలిసి సూపర్ హ్యాపీ అవుతున్నారు. తప్పకుండా ఈ సినిమాలు సమంతని మళ్లీ ఫాంలోకి తెస్తాయని చెప్పొచ్చు.
