పెళ్లి తరువాత సామ్‌లో కొత్త కళ బావుందే!
తాను నిర్మించిన థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ `శుభం`లో గెస్ట్ క్యారెక్టర్ చేసిన సామ్ త్వరలో పూర్తి స్థాయి క్యారెక్టర్‌తో యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
By: Tupaki Entertainment Desk | 7 Feb 2026 4:00 AM ISTకెరీర్ పరంగా కొంత విరామం తీసుకున్న సమంత మళ్లీ తనదైన మార్కు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతోంది. తాను నిర్మించిన థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ `శుభం`లో గెస్ట్ క్యారెక్టర్ చేసిన సామ్ త్వరలో పూర్తి స్థాయి క్యారెక్టర్‌తో యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆమె నటిస్తున్న భారీ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా `మా ఇంటి బంగారం`. నందిని రెడ్డి డైరెక్టర్. సామ్ తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత నిర్మిస్తున్న రెండవ సినిమా ఇది.

నందినిరెడ్డి డైరెక్టర్ అయినా సామ్ భర్త రాజ్ నిడిమోర్ క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. గత నెల విడుదల చేసిన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీని 1980వ దశకం నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇష్టం లేకుండానే ఓ కుటుంబంలోకి ప్రవేశించిన కోడలిని ఆ ఇంటి వారు ఎలా బయటకి వెళ్లగొట్టాలనుకున్నారు? ఇందులో వారు చేసిన ప్రయత్నాలని సామ్ ఎలా తిప్పి కొట్టింది అన్నదే ఈ చిత్ర ప్రధాన కథగా తెలుస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే నాగాచైతన్యతో విడాకులు తీసుకుని కొంత కాలం ఆరోగ్య సమస్యలతో సతమతమైన సామ్ ఇటీవల డైరెక్టర్ రాజ్ నిడిమోర్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తరువాత నుంచి ప్రొఫెషనల్ వర్క్‌లో సామ్‌బిజీగా మారిపోయింది. రాజ్ నిడిమోర్ సహకారంతో `శుభం` మూవీని నిర్మించి సక్సెస్ సాధించిన సమంత అదే జోష్‌తో ఇప్పుడు `మా ఇంటి బంగారం`లో నటిస్తూ నిర్మిస్తోంది.

ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే గతంలో సోషల్ మీడియాలో బిజీగా ఉన్నట్టే ఇప్పుడూ అదే పంథాని కొనసాగిస్తూ చాలా చలాకీగా వ్యవహరిస్తోంది. రాజ్‌తో కలిసి క్రిస్మస్ వేడుకలని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న సామ్ ఇప్పుడు కొత్త కళని సంతరించుకుని అంతరిని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా సామ్ లంగాఓణీ తరహా డ్రెస్‌లో కనిపిస్తున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సామ్ గతంలో కోల్పోయిన గ్లో మళ్లీ కనిపిస్తుండటంతో సామ్‌లో కొత్త కళ బాగుందని కామెంట్‌లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సమంత `మా ఇంటి బంగారం`తో పాటు మరో క్రేజీ మూవీలోనూ నటిస్తోంది. రాజ్ అండ్ డీకె సంయుక్తంగా రూపొందిస్తున్న `రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్ లోనూ సమంత కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులోని ఇతర ప్రధాన పాత్రల్లో ఆదిత్యరాయ్ కపూర్, అలీ ఫజల్ తదితరులు నటిస్తున్నారు. దీన్ని ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాజ్ అండ్ డీకె తెరకెక్కిస్తున్నారు. `మా ఇంటి బంగారం` తరువాత ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
