Begin typing your search above and press return to search.

రష్మిక మూవీ.. సామ్ రిజెక్ట్ చేసిందా?

ఇటీవల థామా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న.. మరికొద్ది రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ తో సినిమాతో రానున్నారు.

By:  M Prashanth   |   31 Oct 2025 11:45 AM IST
రష్మిక మూవీ.. సామ్ రిజెక్ట్ చేసిందా?
X

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అటు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తూనే.. ఇటు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా సందడి చేస్తున్నారు. ఇటీవల థామా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న.. మరికొద్ది రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ తో సినిమాతో రానున్నారు.

నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో లీడ్ రోల్ లో కనిపించనున్నారు. దసరా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో సందడి చేయనున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ది గర్ల్ ఫ్రెండ్.. నవంబర్ 7వ తేదీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.

అయితే ది గర్ల్ ఫ్రెండ్ మూవీని ముందు స్టార్ హీరోయిన్ సమంత రిజెక్ట్ చేశారని, ఆ తర్వాత రష్మిక ఓకే చేశారని కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఇప్పుడు ఆ విషయంపై రాహుల్ రవీంద్రన్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తాను సినిమాలో మొదటగా హీరోయిన్ ను సమంత అనే అనుకున్నానని ఆయన తెలిపారు.

కానీ ఆమె కథ మొత్తం చదివిన తర్వాత, తాను గర్ల్ ఫ్రెండ్ సినిమా చేయడానికి కరెక్ట్ కాదని తెలిపినట్లు చెప్పారు. తాను కాకుండా వేరే హీరోయిన్ ఎవరైనా చేస్తేనే బాగుంటుందని సామ్ చెప్పినట్లు వెల్లడించారు. ఆ తర్వాత రష్మిక మందన్నను అప్రోచ్ చేసి సెలెక్ట్ చేశామని తెలిపారు. తద్వారా ఇప్పటికే వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.

మొత్తానికి సమంత.. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ స్క్రిప్ట్ స్టోరీ చదివాక నచ్చినా.. జెన్యూన్ గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే రష్మిక రెండు రోజుల్లోనే స్క్రిప్ట్ చదివి తనకు కాల్ చేసిందని రాహుల్ తెలిపారు. ఇలాంటి కథ తప్పకుండా చెబుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. స్క్రిప్ట్‌ బాగా కనెక్ట్‌ అయినట్టు చెప్పారని అన్నారు.

"సినిమాలో అమ్మాయిలు బలంగా కనెక్ట్ చేసే అంశాలు చాలా ఉన్నాయని రష్మిక అన్నారు. అందుకే ఆమెకు స్పెషల్ మూవీ అని కూడా చెప్పారు. కానీ యానిమల్ వంటి రీ మాస్ హిట్ తర్వాత రష్మికను పూర్తిగా రియలిస్టిక్ లుక్‌ లో చూపించాలన్న ఆలోచనపై టెన్షన్ పడ్డా. కానీ రష్మిక తనను నిజమైన వ్యక్తిగా చూపించండని, అదే తన పాత్రకు సరైన దారి అని అన్నారు" అంటూ రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చారు.