సమంత -రాజ్ పెళ్లి విందు.. ఏ ఏ వంటకాలు వడ్డించారో తెలుసా?
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ గా పేరు సొంతం చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది.
By: Madhu Reddy | 4 Dec 2025 5:55 PM ISTప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ గా పేరు సొంతం చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. కోయంబత్తూర్ లోని ఈషా యోగా కేంద్రం వద్ద ఉన్న లింగ బైరవి సన్నిధిలో ఏడడుగుల అమ్మవారి విగ్రహం ముందు భూత శుద్ధి పద్ధతిలో సమంత, రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. ఇకపోతే ఈ వివాహాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫోటోలను పంచుకుంది.
వివాహం అనంతరం సమంతా క్లోజ్ ఫ్రెండ్ అయిన శిల్పారెడ్డి కూడా పెళ్లికి సంబంధించిన మరికొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో సమంత , రాజ్ నిడిమోరుకి సంబంధించిన పెళ్లి ఫోటోలతో పాటు ఆ పెళ్లి వేడుకలలో ఏర్పాటుచేసిన పసందైన విందు భోజనానికి సంబంధించిన ఫోటోలను కూడా శిల్పారెడ్డి పంచుకుంది. అరిటాకులో కమ్మని విందు వడ్డించారు. ఇకపోతే శిల్పారెడ్డి షేర్ చేసిన ఆ ఫోటోలలో ఏ ఏ వంటకాలను ఏర్పాటు చేశారు అనే విషయానికొస్తే..సమంత - రాజ్ వివాహానికి సాత్విక విందు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కంచంలో అరటి ఆకుని పెట్టి.. దానిపై అన్నం, పప్పు, క్యారెట్ బీన్స్ కలిపి చేసిన వేపుడు, వంకాయ కూర, చిన్నపాటి రాగి ముద్ద, బెండకాయ వేపుడు, దోసకాయ కూరతో పాటు రొట్టె ఉన్నాయి. ఈశా యోగ సెంటర్లోని ది పెప్పర్ వైన్ ఈటరీ అనే కేఫ్ ఎలాంటి మసాల దినుసులు లేకుండా ఈ భోజనాన్ని అందించారు. ఇక ప్రస్తుతం శిల్పారెడ్డి షేర్ చేసిన ఈ విందు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సమంత మనసుకు తగ్గట్టుగానే.. సాత్విక భోజనాన్ని ఏర్పాటు చేశారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇక సమంత రాజ్ నిడిమోరు విషయానికి వస్తే.. ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ సమయం నుంచే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నప్పుడే సమంత, నాగచైతన్య మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే విడాకులు తీసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అంతేకాదు సమంత విడాకులు తీసుకున్న ఏడాది తర్వాత రాజ్ కూడా తన భార్య శ్యామలీ దేకి విడాకులు ఇచ్చారు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఇక సమంత - రాజ్ నిడిమోరు తమ భాగస్వాముల నుండి విడిపోయిన తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సిటాడెల్ హనీ బన్నీ అనే మరో వెబ్ సిరీస్ వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఇన్ని రోజులు చట్టపట్టలేసుకొని తిరుగుతూ రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకున్న వీరు ఎట్టకేలకు డిసెంబర్ 1న వివాహం చేసుకొని రూమర్స్ ను కాస్త నిజం చేశారు.
