సమంత 'బంగారం'.. భర్త క్రియేటివ్ టచ్ తో..
ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం మూవీలో యాక్ట్ చేస్తుండగా.. కొన్ని రోజుల క్రితం షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోందని సమచారం.
By: M Prashanth | 8 Jan 2026 10:50 AM ISTస్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అటు హెల్త్.. ఇటు పర్సనల్ రీజన్స్ తో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. నిజానికి.. గత ఏడాది సామ్ తన ప్రొడక్షన్ డెబ్యూ మూవీ శుభంలో కనిపించారు. కానీ అది క్యామియో రోల్ మాత్రమే.
దీంతో సమంత లీడ్ రోల్ లో నటించిన సినిమా కోసం ప్రస్తుతం అంతా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం మూవీలో యాక్ట్ చేస్తుండగా.. కొన్ని రోజుల క్రితం షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోందని సమచారం. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సామ్ తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై నిర్మిస్తున్నారు.
రీసెంట్ గా మా ఇంటి బంగారం మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అందులో రగ్డ్ లుక్ లో కనిపించిన సామ్ అందరినీ ఆకట్టుకున్నారు. మాస్ లుక్స్ లో అదరగొట్టారు. ఓ బస్సులో చీరకట్టులో రగ్డ్ అండ్ సీరియస్ గా కనిపించి మెప్పించారు. దీంతో పోస్టర్ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేసింది. అంతే కాదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే సినిమా నిర్మాణంలో సమంత భర్త, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కీలక పాత్ర పోషిస్తున్నారు. మూవీకి క్రియేటర్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో అది సమంత కమ్ బ్యాక్ సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అయితే రాజ్ నిడిమోరు టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలు సూపర్ హిట్ వెబ్ సిరీస్ లకు క్రియేటర్ గా, డైరెక్టర్ గా వర్క్ చేసి గుర్తింపు సంపాదించుకున్నారు.
ది ఫ్యామిలీ మాన్, ఫర్జీ, సిటాడెల్: హనీ బన్నీ వంటి సిరీస్ లతో అందరినీ మెప్పించారు. ఇప్పుడు తన క్రియేటివ్ టచ్ ను మా ఇంటి బంగారం మూవీకి కూడా ఇవ్వనున్నారన్న మాట. సినిమా స్టోరీతోపాటు మేకింగ్ విషయంలో ఆయన పాత్ర కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. అలా వివాహం అయ్యాక ఒకే సినిమాకు రాజ్ నిడిమోరు, సమంత పని చేయడం విశేషం.
కొంతకాలంగా ప్రేమలో ఉన్న సమంత, రాజ్ నిడిమోరు గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన వివాహం చేసుకున్నారు. తమిళనాడులో ఉన్న ప్రముఖ ఈశా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధ పద్ధతి ద్వారా ఒకటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి తర్వాత కొత్త జంట కలిసి వర్క్ చేస్తున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
