"భూత శుద్ధి పద్ధతి"లో సమంత రెండో పెళ్లి.. ప్రత్యేకత ఇదే!
ఈ మేరకు లింగ భైరవి సన్నిధిలో వివాహం చేసుకోవడానికి గల కారణాన్ని.. అలాగే భూత శుద్ధి పద్ధతిలో ఎందుకు వివాహం చేసుకుంది అనే విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.
By: Madhu Reddy | 1 Dec 2025 2:37 PM ISTప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇన్ని రోజులు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు రాగా.. వాటిని తాజాగా ఆమె కన్ఫామ్ చేసింది. ఈరోజు ఉదయం కోయంబత్తూర్ లోని ఈషా యోగ సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో డైరెక్టర్ రాజ్ తో ఏడు అడుగులు వేసి ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. తన రెండో పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది సమంత. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నూతన జంటకు అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే సమంత చేసుకుంది మామూలు పెళ్లి కాదు..ఇక్కడ కనివిని ఎరుగని రీతిలో "భూత శుద్ధి పద్ధతి"లో వివాహం చేసుకుంది అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఈ భూత శుద్ధి పద్ధతి.. ?ఎందుకు ఈ పద్ధతిలో సమంత వివాహం చేసుకుంది? అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సమంత భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకుంది అంటూ అందుకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ.. నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేసింది ఈశా ఫౌండేషన్.
ఈ మేరకు లింగ భైరవి సన్నిధిలో వివాహం చేసుకోవడానికి గల కారణాన్ని.. అలాగే భూత శుద్ధి పద్ధతిలో ఎందుకు వివాహం చేసుకుంది అనే విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. అసలు ఈశా ఫౌండేషన్ విడుదల చేసిన ప్రకటనలో ఏముంది అనే విషయానికొస్తే.. "కోయంబత్తూర్ లోని ఈశా యోగా కేంద్రం వద్ద ఉన్న లింగ బైరవి సన్నిధిలో సమంత - రాజ్ నిడిమూరు సోమవారం ఉదయం పవిత్రమైన భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగా సాంప్రదాయం ప్రకారం నిర్వహించడం విశేషం.
ఆలోచనలు , భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియ ఈ భూత శుద్ధి వివాహం. ముఖ్యంగా ఈ వివాహ ప్రక్రియ వధూవరుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో శ్రేయస్సు, సామరస్యం, ఆధ్యాత్మికత వెళ్లివిరిసేలా.. ఆ దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది" అంటూ ఈశా ఫౌండేషన్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇకపోతే లింగ బైరవి విషయానికి వస్తే.. "సద్గురు జగ్గీ వాసుదేవ్ చేతుల మీదుగా ఈశా యోగా కేంద్రంలో ప్రాణ ప్రతిష్ట చేయబడిన లింగ భైరవి దేవి.. స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్టమైన ఆచారాలకు ఈ ఆలయం నెలవు. విశ్వంలోనే సృజనాత్మక శక్తికి ప్రత్యేకగా నిలిచే ఈ ఎనిమిది అడుగుల శక్తి స్వరూపం భక్తుల మనసు, శరీరాలను , శక్తులను స్థిరపరుస్తూ జననం నుండి మరణం వరకు జీవితంలోని ప్రతి దశలోను వారికి అండగా నిలుస్తుంది " అంటూ ఈశా ఫౌండేషన్ తెలిపింది. మొత్తానికైతే సమంత భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకుందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
