సామ్ -రాజ్.. కెమెరాలకు చిక్కినా అధికారిక ప్రకటన లేదు!
ఇటీవలి కాలంలో విమానాశ్రయాల్లో కెమెరాలు కాపు కాస్తున్నాయి. అక్కడ దొరికిపోయే సెలబ్రిటీ ప్రేమ జంటల ఫోటోలు, వీడియోలను క్యాప్చుర్ చేయడం కోసం పాకులాడుతున్నాయి.
By: Sivaji Kontham | 20 Nov 2025 12:19 PM ISTఇటీవలి కాలంలో విమానాశ్రయాల్లో కెమెరాలు కాపు కాస్తున్నాయి. అక్కడ దొరికిపోయే సెలబ్రిటీ ప్రేమ జంటల ఫోటోలు, వీడియోలను క్యాప్చుర్ చేయడం కోసం పాకులాడుతున్నాయి. అలా సోషల్ మీడియాల్లోకి వచ్చిన ప్రేమ జంటల్ని రెడ్డిటర్లు మరింత పాపులర్ చేస్తున్నారు. ఇదే కోవలో పాపులరైన జంట సమంత- రాజ్ నిడిమోరు. ఈ జంటపై చాలా కాలంగా డేటింగ్ రూమర్లు వైరల్ అవుతున్నాయి.
అగ్ర కథానాయిక సమంత గత కొంతకాలంగా `ఫ్యామిలీమ్యాన్` దర్శక ద్వయంలోని రాజ్ తో ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. పలుమార్లు ఈ జంట కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. అప్పట్లో ఓ స్టేడియంలో క్రికెట్ ని ఆస్వాధిస్తూ ఆనందంగా కనిపించిన జంట ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇటీవల ముంబైలో ఓసారి కెమెరా కంటికి చిక్కారు. పలుమార్లు హైదరాబాద్ లో సినిమా ఈవెంట్లలోను ఈ జంట కనిపించారు. సమంత స్వయంగా నిర్మించిన `బంగారం` సినిమా ప్రమోషన్లలోను రాజ్ నిడిమోరు ప్రధానంగా హైలైట్ అయ్యారు.
ఇప్పుడు మరోసారి హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెళుతూ.. ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. ట్రావెల్ బ్యాగ్స్ తో రాజ్ నిడిమోరు ధీమాగా నడుచుకుంటూ వెళుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. అందమైన జంట... ప్రతిసారీ విమానాశ్రయాల్లో కెమెరాకు చిక్కుతోంది అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ జోడీ డేటింగ్ వ్యవహారంపై ఇప్పటివరకూ స్పందించలేదు. రాజ్ కానీ, సమంత కానీ ప్రేమ వ్యవహారం గురించి ఎక్కడా అధికారికంగా ప్రస్థావించలేదు.
సమంత, రాజ్ ఇటీవల ఎవరికి వారు కెరీర్ విషయంలో సీరియస్ గా ఉన్నారు. రాజ్ అండ్ డీకే స్వయంగా నిర్మిస్తున్న `రక్త్ బ్రహ్మాండ్` వెబ్ సిరీస్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సిరీస్ లో సమంత ఓ కీలక పాత్రను పోషిస్తోంది. మరోవైపు సామ్ సొంత బ్యానర్ లో హారర్ కామెడీ శుభం ని నిర్మిస్తున్నారు. తదుపరి నటించాల్సిన సినిమాలపైనా సీరియస్‌గా పని చేస్తున్నారని సమాచారం.
