సామ్.. ఆ హ్యాండ్ రాజాదేనా?
తాజాగా ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయ్ వెళ్లిన సమంత.. అక్కడ తన మూమెంట్స్ ను వీడియో రూపంలో దుబాయ్ ఫర్ ఎ మినిట్ అంటూ షేర్ చేసుకున్నారు.
By: M Prashanth | 2 Sept 2025 7:06 PM ISTస్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు డేటింగ్ లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయా వార్తలకు మరింత చేకూర్చుతున్నాయి సామ్ సోషల్ మీడియా పోస్టులు. కానీ ఇప్పటి వరకు వార్తలపై అటు రాజ్ గానీ.. ఇటు సమంత రెస్పాండ్ అవ్వకపోవడం గమనార్హం.
వెకేషన్ లో భాగంగా సమంత ఎక్కడికి వెళ్లినా.. రాజ్ ఆమె వెంట కనిపిస్తున్నారు. రీసెంట్ గా అమెరికా వెళ్లిన సామ్.. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న పిక్స్ ను షేర్ చేశారు. అందులో రాజ్ కూడా ఉన్నారు. అమెరికా వీధుల్లో వీరిద్దరూ కలిసి నడుస్తూ, రెస్టరంట్ లో ఫుడ్ తింటూ కనిపించారు. ఇప్పుడు సామ్ పోస్ట్ చేసిన మరో వీడియో వైరల్ గా మారింది.
తాజాగా ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయ్ వెళ్లిన సమంత.. అక్కడ తన మూమెంట్స్ ను వీడియో రూపంలో దుబాయ్ ఫర్ ఎ మినిట్ అంటూ షేర్ చేసుకున్నారు. వాట్ ఐ సీ వర్సెస్ వాట్ యు సీ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో ఓ చోట.. సామ్ ఒకరి చేయి పట్టుకుని కనిపించింది. ఇప్పుడు ఆ సీన్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
అయితే ఆ చేయి రాజ్ నిడిమోరుదేనా అని నెటిజన్లు అడుగుతున్నారు. సామ్ రిలేషన్ గురించి చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు. ఏదేమైనా వీడియో బాగుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. దిశా పటానీ, రుహానీ శర్మ సహా పలువురు సెలబ్రిటీలు కూడా క్యూట్ అంటూ వీడియో కింద లవ్ సింబల్స్ పెట్టడం విశేషం.
కాగా.. రాజ్- డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటడెల్ : హనీ బన్నీ వెబ్ సిరీసుల్లో సామ్ యాక్ట్ చేశారు. ఆ ప్రాజెక్టులకు వర్క్ చేసిన సమయంలో రాజ్, సామ్ పరిచయమయ్యారు. ఇటీవల సమంత నిర్మించిన శుభం సినిమాకు రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆ మూవీ తర్వాత రాజ్ పిక్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉన్నారు.
అయితే రాజ్ నిడిమోరుకు ఇప్పటికే శ్యామాలితో వివాహమైంది. ఆమె చివరిసారిగా 2023లో రాజ్ తో కలిసున్న ఫొటోను షేర్ చేశారు. వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు కూడా వచ్చినా.. ఇద్దరూ రెస్పాండ్ అవ్వలేదు. కానీ సామ్, రాజ్ డేటింగ్ రూమర్స్ వస్తున్నప్పటి నుంచి శ్యామాలి మాత్రం సందేశాత్మక పోస్టులు పెడుతుండగా.. అవి ఫుల్ వైరల్ అవుతున్నాయి.
