Begin typing your search above and press return to search.

జిమ్ కు రాజ్ తోనే సమంత.. ఇంకెప్పుడు క్లారిటీ ఇస్తారో?

స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   24 Sept 2025 12:22 AM IST
జిమ్ కు రాజ్ తోనే సమంత.. ఇంకెప్పుడు క్లారిటీ ఇస్తారో?
X

స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారన్న విషయం తెలిసిందే. మెయిన్ గా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నారని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఆ విషయంపై అటు సామ్.. ఇటు రాజ్ రెస్పాండ్ అవ్వడం లేదు. కానీ తరచూ కలిసే కనిపిస్తున్నారు.

సామ్ ఎక్కడుంటే రాజ్ అక్కడే.. ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వెకేషన్స్ కు వెళ్లడం.. అక్కడి పిక్స్ దిగి పోస్ట్ చేయడం.. ఒకే కారులో ప్రయాణించడం.. డిన్నర్స్ కోసం రెస్టారెంట్ కు వెళ్లడం.. రాజ్ భుజంపై సామ్ తల వాల్చడం.. చేయి పట్టుకుని పిక్ దిగడం.. పికెల్ బాల్ ఆడటం.. కలిసి ఆలయాలకు వెళ్లడం వంటి పలు సంఘటనలు రిలేషన్ షిప్ వార్తలకు ఊతమిస్తున్నాయి.

దీంతో రాజ్ - సమంతల్లో ఎవరో ఒకరు రేపో మాపో గుడ్ న్యూస్ చెబుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఇద్దరూ సైలెంట్ గా ఉన్నారు. తాజాగా ముంబై బాంద్రాలోని ఓ జిమ్ నుంచి సమంత, రాజ్‌ బయటకు వస్తూ కనిపించారు. ఇద్దరు లైట్ పింక్ కలర్ డ్రెస్ ధరించి బాగా వర్కౌట్లు చేసినట్లు కనిపించారు.

జిమ్ నుంచి బయటకు వచ్చి ఒకే కారులో వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత- రాజ్ తమ బంధంపై క్లారిటీ ఇవ్వాలని నెటిజన్లు, అభిమానులు అడుగుతున్నారు. ఇంకెప్పుడూ చెబుతారు మేడమ్.. అంటూ సామ్ ను క్వశ్చన్ చేస్తున్నారు.

అయితే రాజ్ ది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు. ఇప్పటికే ఆయనకు శ్యామాలితో వివాహం అయింది. వారిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉందని సమాచారం. రాజ్, శ్యామాలి విడిపోతున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీనిపై వారిలో ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ శ్యామాలి రకరకాల పోస్టులు పెడుతున్నారు.

కొంతకాలంగా సందేశాత్మక పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా నమ్మకం, విశ్వాసం వంటి అంశాలపై ఆమె చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. మొత్తానికి సామ్, రాజ్ వ్యవహారం సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి దానిపై వారిద్దరు ఎప్పుడు రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి.