మిషన్ కంప్లీటెడ్.. సమంత ఛాలెంజ్ స్వీకరించేదెవరు?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 23 Jan 2026 12:08 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో.. అద్భుతమైన నటనతో పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేసి మరీ అందరిని మెప్పించింది. అలాంటి ఈమె కెరియర్ పరంగా ఉన్నత శిఖరాలను చేరుకున్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా తన మొదటి భర్త నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది సమంత.
తర్వాత ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలసి చట్టాపట్టాలేసుకొని తిరిగి రూమర్స్ ఎదుర్కొంది. ఇక ఆ రూమర్స్ ను నిజం చేస్తూ గత ఏడాది డిసెంబర్ ఒకటిన కోయంబత్తూర్ లోని ఈషా యోగ సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధ పద్ధతిలో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత మళ్లీ బిజీ అయిన విషయం తెలిసిందే. ఒకవైపు పలు బ్రాండ్లను ప్రారంభిస్తూనే.. మరొకవైపు తన సినిమాలను పూర్తి చేసే పనిలో పడింది. అలా తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై తన రెండవ సినిమా 'మా ఇంటి బంగారం' సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఇందులో లీడ్ రోల్ పోషిస్తుంది సమంత.
నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా.. ఇందులో సమంత యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. ఇకపోతే నిత్యం జిమ్ లో యాక్టివ్ గా ఉంటూ అందుకు సంబంధించిన ఫోటోలను ,వీడియోలను అభిమానులతో పంచుకునే ఈమె తాజాగా @emmyrwhite ఇచ్చిన మిషన్ ను కంప్లీట్ చేసి మరొకరికి ఛాలెంజ్ విసిరింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
నిత్యం జిమ్లో యాక్టివ్ గా ఉండే సమంతకి ఒక మిషన్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అదే పుష్ అప్స్ లో వినూత్న ప్రయోగం. పుష్అప్స్ చేస్తూనే మూమెంట్ ఇవ్వాలి. ముందుకు వెనక్కి కదులుతూ.. ఎడమ చేయిని కుడి కాలికి, కుడి చేయి ఎడమ కాలిను తాకుతూ.. శరీరం నేలను తాకకుండా ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలా సునాయాసంగా తన మిషన్ కంప్లీట్ చేసింది సమంత. ఇక ఆమె షేర్ చేసిన ఆ వీడియో చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఈజీగా కంప్లీట్ చేసేసింది ఏంటి అంటూ ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు.
డెడికేషన్ కి డెఫినేషన్ మీరు అని ఒకరు కామెంట్ చేస్తుంటే.. మరికొంతమంది ఓ మై గాడ్ అంటూ.. ఇంకొంతమంది ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది సమంత సెలబ్రిటీ ట్రైనర్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా పుష్ అప్స్ లో ఖచ్చితమైన మూవ్స్ ఇస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. సమంత తన మిషన్ కంప్లీట్ చేసింది. మరి సమంత ఛాలెంజ్ ను ఎవరు స్వీకరిస్తారో చూడాలి.
