Begin typing your search above and press return to search.

ముందే సేఫ్ జోన్‌ లో సమంత.. మరి వేరే నిర్మాత అయ్యుంటే?

ప్రస్తుతం మా ఇంటి బంగారం విషయంలో అదే చర్చ జరుగుతోంది. నిజానికి ఖుషి తర్వాత సమంత నుంచి లీడ్ రోల్ సినిమా రాలేదు. మధ్యలో శుభంలో గెస్ట్ రోల్ లో కనిపించినా అభిమానులు ఆశించిన స్థాయిలో అది సరిపోలేదు.

By:  M Prashanth   |   21 Jun 2026 9:32 AM IST
ముందే సేఫ్ జోన్‌ లో సమంత.. మరి వేరే నిర్మాత అయ్యుంటే?
X

హీరోగా నటిస్తూ నిర్మాతగా మారడం కొత్త విషయం కాదు. కానీ ఒక స్టార్ హీరోయిన్ తన కెరీర్‌ లో కీలకమైన కమ్‌ బ్యాక్ సినిమాతో నిర్మాతగా కూడా వ్యవహరించి, విడుదలకు ముందే సేఫ్ జోన్‌ లోకి వెళ్లడం మాత్రం అరుదైన విషయం. ప్రస్తుతం మా ఇంటి బంగారం విషయంలో అదే చర్చ జరుగుతోంది. నిజానికి ఖుషి తర్వాత సమంత నుంచి లీడ్ రోల్ సినిమా రాలేదు. మధ్యలో శుభంలో గెస్ట్ రోల్ లో కనిపించినా అభిమానులు ఆశించిన స్థాయిలో అది సరిపోలేదు.

దాదాపు మూడేళ్ల తర్వాత ఆమె మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సామ్.

నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఆ చిత్రంపై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఓ బేబీ విజయం కూడా ప్లస్ అయింది. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత ఆసక్తి పెరిగింది. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా అంశాలతో రూపొందిన ఆ సినిమా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ థియేటర్స్ లో సందడి చేస్తోంది.

అయితే విడుదలకు ముందే సినిమాకు సాలిడ్ రేంజ్ లో బిజినెస్ జరిగింది. ముఖ్యంగా ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ రూపంలో నిర్మాతలకు భారీ ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడే సమంత తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆ ప్రాజెక్ట్ మొదట నిర్మాత రామ్ తాళ్లూరి వద్ద ఉండిందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అయితే తర్వాత సమంత స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకోవడంతో ప్రొడక్షన్ హౌస్ మారింది. అదే ఇప్పుడు ఆమెకు పెద్ద ప్లస్‌ గా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా రూ.35 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన సినిమా విడుదల తర్వాత తన రిజల్ట్ ను ప్రూవ్ చేసుకోవాలి. కానీ మా ఇంటి బంగారం విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా బడ్జెట్ లో ఎక్కువ భాగం ముందుగానే రికవరీ అయినట్లు సమాచారం. అంటే థియేటర్లలో వచ్చే వసూళ్లు ఎక్స్ ట్రా ప్రాఫిట్స్ దిశగా వెళ్లే అవకాశం ఉంది.

ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.13.15 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పాజిటివ్ టాక్‌ ను చూస్తే తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే నిర్మాతగా సమంతకు ఇది మరింత పెద్ద విజయం అవుతుంది. నటిగా ప్రేక్షకుల పొందడమే కాకుండా బిజినెస్ కూడా సరైన నిర్ణయం తీసుకున్నట్లు నిరూపించుకున్నట్టవుతుంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇదే సినిమా రామ్ తాళ్లూరి చేతిలో ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అంటూ.. అయితే విడుదలకు ముందే రికవరీ ఒత్తిడి, థియేట్రికల్ రిజల్ట్ పై ఆధారపడేది ఎక్కువగా ఉండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ సమంత నిర్మాతగా ఉండటంతో రిస్క్‌ ను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా మా ఇంటి బంగారం మూవీతో సామ్ కేవలం హీరోయిన్‌ గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా సరైన అడుగువేసిందనే చర్చ సాగుతోంది. సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యే సరికి ఆ నిర్ణయం ఎంత పెద్ద మాస్టర్ స్ట్రోక్‌ గా మారిందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.