అవును.. నేను తల్లిని కాబోతున్నా.. క్లారిటీ ఇచ్చిన సమంత!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా స్పందిస్తూ అభిమానులతో పంచుకుంది.
By: Madhu Reddy | 25 Jun 2026 9:33 AM ISTప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా స్పందిస్తూ అభిమానులతో పంచుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత మా ఇంటి బంగారం అనే సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది సమంత. ఈమె ప్రధాన పాత్రలో ఫ్యామిలీ యాక్షన్ ఓరియంటెడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు జూన్ 19వ తేదీన వచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ అందుకుంది. లేడీ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో సమంత తన యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది.
ముఖ్యంగా ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సమంత నటనపై , నందిని రెడ్డి టేకింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా సక్సెస్ అందుకున్న నేపథ్యంలో నందిని రెడ్డి గ్రాండ్గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా.. అందులో పాల్గొన్న సమంత బేబీ బంప్ తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. దీనితో సమంత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. మరికొంతమంది ఇది పి.ఆర్ గేమ్ అంటూ విమర్శలు కూడా చేశారు.
అయితే ఇటీవల సమంత తన చిత్ర బృందంతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా కలిసినప్పుడు చిరంజీవి మీకు డబల్ కంగ్రాట్స్ అంటూ తెలిపారు. రాజ్ , సమంత జీవితంలోకి కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్నందుకు శుభాకాంక్షలు అంటూ తెలిపారు. ఇక చిరంజీవి సమంత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అభిమానులతో కాస్త ఇన్ డైరెక్ట్ గానే హింతిస్తూ చెప్పేశారు. అయితే ఇప్పుడు ఆ విషయాలను సమంత ఓపెన్ గా చెప్పేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేసింది .
తాజాగా మీడియా మిత్రులతో సక్సెస్ మీట్ నిర్వహించగా.
సమంత మాట్లాడుతూ.. మూడేళ్లు గ్యాప్ తీసుకొని మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను.. ఇప్పుడు కొంతకాలం బ్రేక్ తీసుకొని మళ్లీ వస్తాను. మీరు అనుకుంటున్నట్టు నిజమే. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్.. మెటర్నటీ లీవ్ తీసుకొని మళ్ళీ కొంతకాలం తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే సమంత ప్రెగ్నెంట్ అని బహిరంగంగా చెప్పడంతో అటు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. మొదటి సినిమాతోనే జెస్సీ పాత్రతో అద్భుతమైన నటన కనబరిచి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ ఈమెను ఓన్ చేసుకున్నారు. అద్భుతమైన నటన, చిలిపితనం, అమాయకత్వం కలబోసిన ఒక అపురూప బొమ్మగా అందరి దృష్టిని ఆకట్టుకుంది సమంత. మొదటి సినిమాలో సహనటుడిగా నటించిన అక్కినేని వారసుడు నాగచైతన్యతో ప్రేమలో పడిన ఈమె ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత పెద్దలను ఒప్పించి, హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో విడిపోయారు. ఆ తర్వాత సమంత చికిత్స నిమిత్తం ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తో రిలేషన్ మొదలుపెట్టిన ఈమె అతడితో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటూ శుభవార్త పంచుకుంది. ఏది ఏమైనా సమంతకు వివాహం తర్వాత బాగా కలిసి వచ్చినట్టు ఉంది అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
