Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : వర్కౌట్ ఔట్‌ ఫిట్‌లో సామ్‌ కొత్తగా..!

సమంత తిరిగి పుంజుకోవడం మాత్రమే కాకుండా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు, సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను రెడీ అవుతోంది.

By:  Ramesh Palla   |   26 Aug 2025 12:17 PM IST
పిక్‌టాక్‌ : వర్కౌట్ ఔట్‌ ఫిట్‌లో సామ్‌ కొత్తగా..!
X

'ఏమాయ చేసావె' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సమంత. మొదటి సినిమాతోనే నటిగా తనను తాను నిరూపించుకోవడంతో ఏమాత్రం గ్యాప్ లేకుండా ఏకంగా ఎన్టీఆర్‌తో బృందావనం సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో మరో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌తో పోటీ పడి మరీ నటించడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. బృందావనం తర్వాత సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినిమా జీవితంతో పాటు, వ్యక్తిగత జీవితం కూడా చాలా సాఫీగా, సూపర్‌ హిట్‌ అన్నట్లుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా విడాకులు, మయోసైటిస్ అనారోగ్య సమస్యల కారణంగా సమంత చాలా సమస్యలు ఎదుర్కొంది. ఒక ఏడాది పాటు సమంత కనుమరుగు అయింది, తిరిగి ఆమె పుంజుకుంటుందా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.

జిమ్‌లో సమంత వర్కౌట్స్‌

సమంత తిరిగి పుంజుకోవడం మాత్రమే కాకుండా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు, సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను రెడీ అవుతోంది. రాబోయే రోజుల్లో సమంత మునుపటి వేగంతో సినిమాలు చేసినా ఆశ్చర్యం లేదు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ సమంత సొంతం అంటారు. తన ఫిజిక్‌ను మొదటి నుంచి ఇప్పటి వరకు ఒకే తరహాలో మేనేజ్ చేయడం కోసం సమంత చాలా కష్టపడుతుంది. ప్రతి రోజూ గంటల తరబడి వర్కౌట్‌లు చేస్తూనే ఉంటుంది. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా సమంత వర్కౌట్స్ ఆపదు అని, ఆమె ప్రతి రోజు మినిమం వర్కౌట్‌ చేయకుండా ఉండలేదు అని ఆమెను సన్నిహితంగా చూసే వారు, రెగ్యులర్‌గా ఆమెను ఫాలో అయ్యే వారు అంటూ ఉంటారు. తాజాగా వర్కౌట్ ఔట్‌ ఫిట్‌లో జిమ్‌ బయట సమంత కెమెరాలకు చిక్కింది.

సమంత అందం ఏమాత్రం తగ్గలేదు

యాష్‌ కలర్‌ స్పోర్ట్స్ బ్రా ధరించి, లావెండర్‌ టైట్‌ జెగ్గిన్‌ ధరించిన సమంత అలా నడుచుకుంటూ వెళ్తుంటే చూపు తిప్పలేకుండా ఉన్నాం. సమంత పద్దతైన చీర కట్టుతో పాటు, అల్ట్రా మోడ్రన్‌ డ్రెస్‌ల్లోనూ చాలా అందంగా ఉంటుంది. వాటిల్లోనే కాకుండా ఇలా వర్కౌట్‌ ఔట్‌ ఫిట్‌లోనూ చాలా అందంగా సమంత ఉందని చాలా మంది ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా 15 ఏళ్లు దాటింది. అయినా కూడా ఇప్పటికీ 20 పదుల వయసు అమ్మాయి మాదిరిగా చాలా అందంగా ఉన్నారు అంటూ సమంతను చాలా మంది నెటిజన్స్ ప్రశంసించడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఫోటోలు నెట్టింట ప్రత్యక్షం అయినప్పుడు ఖచ్చితంగా అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు కూడా ఖచ్చితంగా ఆమెను ప్రశంసించకుండా ఉండలేరు అనడంలో సందేహం లేదు.

రక్త్‌ బ్రహ్మాండ్‌ సిరీస్‌ కోసం వెయిటింగ్‌

2023లో శాకుంతలం, ఖుషి సినిమాలతో వచ్చిన సమంత గత ఏడాది సినిమాలు ఏమీ చేయలేదు. మయోసైటిస్ కారణంగా దాదాపు ఏడాది పూర్తిగా షూటింగ్స్‌కు దూరంగా ఉంది. ఇక సమంత ఇటీవల తన నిర్మాణంలో శుభం సినిమాను తీసుకు వచ్చింది. ఆ సినిమా కు మంచి మార్కులు దక్కాయి. అందులో చిన్న గెస్ట్‌ రోల్‌లో కనిపించిన విషయం తెల్సిందే. ఇక ఇప్పటికే ప్రకటించిన మా ఇంటి బంగారం సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరో వైపు ఈమె రెండు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అందులో ప్రధానంగా రక్త్‌ బ్రహ్మాండ్‌ సిరీస్‌ లో సమంత పాత్ర మామూలుగా ఉండదు అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విడాకుల తర్వాత సమంత ఇటీవల ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వివరాలు మాత్రం వెళ్లడి కావాల్సి ఉంది.