Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో సమంత - రాజ్.. ఎక్కడికి వెళ్లారో తెలుసా?

ఇక వివాహం తర్వాత పెద్దగా మీడియా ముందుకు రాని ఈ జంట సడన్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా వెకేషన్ వెళ్ళింది.

By:  Madhu Reddy   |   31 Dec 2025 3:58 PM IST
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో సమంత - రాజ్.. ఎక్కడికి వెళ్లారో తెలుసా?
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది సమంత. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న సమంత.. కెరియర్ పీక్స్ లో ఉండగానే అక్కినేని వారసుడు నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సమంత మధ్యలో యశోద , శాకుంతలం వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..కానీ ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో ఖుషీ సినిమా చేసింది. అయితే ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.

ఇక తెలుగులో సినిమాలు చేయకుండా బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ మంచి విజయాన్ని అందించడమే కాకుండా పలు అవార్డులు కూడా అందించింది. ఇకపోతే ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే ఈ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడిందనే వార్తలు రాగా గత కొన్ని నెలలుగా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరిగారు. పైగా వెకేషన్ లకు వెళ్లడం, జిమ్ సెంటర్లకు ఇలా ఎక్కడపడితే అక్కడ కలిసి కనిపించడంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ కూడా దీనిపై స్పందించలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది డిసెంబర్ 1న కోయంబత్తూర్ లోని ఈ యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో భూతశుద్ధ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

ఇక వివాహం తర్వాత పెద్దగా మీడియా ముందుకు రాని ఈ జంట సడన్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా వెకేషన్ వెళ్ళింది. అందులో భాగంగానే పోర్చుగల్ లోని లిస్బన్ కి నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి కొత్తజంట వెళ్ళింది. ముఖ్యంగా వివాహం తర్వాత వచ్చిన మొదటి న్యూ ఇయర్ కావడంతో అక్కడికి వెకేషన్ కి వెళ్ళింది ఈ జంట. ముఖ్యంగా అక్కడి నుంచి సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సమంత.. ఈ కొత్త ప్రయాణంలో ఉల్లాసమైన క్షణాలను, తాను సందర్శించిన మార్గాలను అభిమానులతో పంచుకుంది. ఇకపోతే చాలా కాలం తర్వాత ఇలా సంతోషంగా కనిపించి అభిమానులను మరింత సంతోషపరిచింది.

ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మా ఇంటి బంగారం అనే సినిమా నిర్మిస్తోంది. అలాగే ఇందులో లీడ్ రోల్ కూడా పోషిస్తుంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ఓ బేబీ సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.