ఆత్మీయ ఆలింగనం.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన సమంత!
కానీ తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో తన తల్లితో కలిసి దిగిన ఫోటోని పంచుకుంది. అందులో వారిద్దరూ నవ్వుతూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నట్టు మనం చూడవచ్చు .
By: Madhu Reddy | 6 Dec 2025 7:41 PM ISTసమంత.. ఈ చెన్నై బ్యూటీ తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కెరియర్ ఆరంభించిన ఈమె.. ఇండస్ట్రీలోకి రాకముందు చిన్న చిన్న యాడ్స్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. తమిళ్ చిత్రాలతో తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో కి ఏ మాయ చేసావే' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో జెస్సీ క్యారెక్టర్ లో అభిమానుల హృదయాలను దోచుకుంది. అంతేకాదు యువత ఫేవరెట్ గర్ల్ గా కూడా మారిపోయింది సమంత.
ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే తన మొదటి సినిమా హీరో అక్కినేని వారసుడు, నాగచైతన్యతో ప్రేమలో పడి ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహం అందరికీ చూడముచ్చటగా అనిపించింది. అయితే ఈ వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లైన నాలుగేళ్లకే ఈ జంట విడాకులు తీసుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇక గత ఏడాది నాగచైతన్య తాను ప్రేమించిన ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేయగా.. సమంత ఈ ఏడాది ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న ఏడడుగులు వేసింది. ఇషా యోగ సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇకపోతే అటు రాజ్ నిడిమోరుకి కూడా పెళ్లయి ఒక పాప ఉండగా.. భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలా ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.
ఇకపోతే వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమంత షేర్ చేస్తూ పెళ్లిని అధికారికంగా ప్రకటించింది. అలాగే పెళ్లిలో ఇన్సైడ్ ఫోటోలను సమంత స్నేహితురాలు శిల్పారెడ్డి కూడా పంచుకున్నారు. అయితే ఈ ఇద్దరు షేర్ చేసుకున్న ఫోటోలలో సమంత తల్లి ఎక్కడ కనిపించలేదు. దీంతో సమంత తల్లి ఈ పెళ్ళికి రాలేదేమో అని కొంతమంది ఊహగానాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో తన తల్లితో కలిసి దిగిన ఫోటోని పంచుకుంది. అందులో వారిద్దరూ నవ్వుతూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నట్టు మనం చూడవచ్చు .
సమంత తన జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకోవడాన్ని తన తల్లి పూర్తిగా ఆహ్వానించినట్లు ఆ ఫోటో తెలుపుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. తన తల్లిని ఆలింగనం చేసుకుంటూ మమ్మీ అంటూ క్యాప్షన్ జోడించింది. ఇక సమంత షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. మరోవైపు సమంత పెళ్లి జరిగి నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే తన సినిమాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఆమె తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ' మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ సెట్లో అడుగుపెట్టింది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ పోషిస్తుంది.
