నా విడాకులను కొంతమంది సెలబ్రేట్ చేసుకున్నారు
సమంత. కొంత కాలం ముందు వరకు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సమంత ఇటీవల కాలంలో ఎన్నో కష్టాలను ఎదుక్కోన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 23 Oct 2025 6:15 PM ISTసమంత. కొంత కాలం ముందు వరకు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సమంత ఇటీవల కాలంలో ఎన్నో కష్టాలను ఎదుక్కోన్నారు. ఫ్యాన్స్ నుంచి ఎంత ప్రేమాభిమానాలు దక్కినా, తన పర్సనల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు ఆమెను ఎంతో ఇబ్బంది పెట్టాయి. నాగ చైతన్య నుంచి విడిపోవడం, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో బాధపడటం ఇవన్నీ సమంతను లైమ్ లైట్ లోకి రాకుండా చేశాయి.
మయోసైటిస్ తో బాధపడుతుంటే ఎగతాళి చేశారు
ఇప్పుడిప్పుడే వాటి నుంచి నెమ్మదిగా కోలుకుని తిరిగి కెరీర్లో పుంజుకోవడానికి సమంత రెడీ అవుతున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తనపై వచ్చిన ట్రోల్స్, నెగిటివిటీ గురించి మాట్లాడారు. తాను కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, ఆ టైమ్ లో తనను ద్వేషించే వాళ్లు తనను చూసి నవ్వారని, ఓ వైపు తాను మయోసైటిస్ తో బాధపడుతుంటే తనను చూసి ఎగతాళి చేశారని చెప్పారు.
పట్టించుకోవడం మానేశా
ఆఖరికి తన విడాకులను కూడా కొంతమంది సెలబ్రేట్ చేసుకున్నారని, తన లైఫ్ ఎలా ఉండాలనే విషయాన్ని కూడా వాళ్లే డిసైడ్ చేసేవారని, అవన్నీ చూసి మొదట్లో చాలా బాధపడ్డానని, కానీ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని గతంలో తనపై వచ్చిన విమర్శలను ఎంతో నిజాయితీగా వెల్లడించారు సమంత. అయితే లైఫ్ లో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సమంత వాటిని ధైర్యంతో ఎదుర్కొంటున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సమంత, రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రక్త్ బ్రహ్మాండ్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సమంత ఎప్పుడెప్పుడు స్క్రీన్ పై కనిపిస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రక్త్ బ్రహ్మాండ్ తో పాటూ తెలుగులో నందినీ రెడ్డి దర్శకత్వంలో సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే సినిమాను చేస్తున్నారు సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న మా ఇంటి బంగారం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.
