'పిల్లలకు వయసుకు ఏంటి సంబంధం?'.. సామ్ అలా అడిగిందేంటి?
సంతాన సాఫల్యత అనేది చాలాసార్లు భయంకరంగా, గందరగోళంగా, తీవ్రమైన ఒత్తిడికి గురి చేసేలా అనిపిస్తుందని, కానీ, నిజంగా అలా ఉండాల్సిన అవసరం లేదు అంటూ క్యాప్షన్ గా రాసుకొచ్చారు.
By: M Prashanth | 11 Dec 2025 10:01 PM ISTస్టార్ హీరోయిన్ సమంత.. రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును డిసెంబర్ 1వ తేదీన తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్ ఈశా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో మనువాడారు. అత్యంత సన్నిహితులు, స్నేహితుల మధ్య సమంత, రాజ్ నిడిమోరు ఒక్కటయ్యారు.
దీంతో సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు.. కొత్త జంటకు ఇప్పటికే విషెస్ చెప్పారు. అదే సమయంలో పిల్లల కోసం సామ్ ఆలోచించాలని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. దానిపై స్పందించని సమంత.. అదే సమయంలో ప్రముఖ గైనకాలజిస్ట్ తో చేసిన చిట్ చాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
సంతాన సాఫల్యత అనేది చాలాసార్లు భయంకరంగా, గందరగోళంగా, తీవ్రమైన ఒత్తిడికి గురి చేసేలా అనిపిస్తుందని, కానీ, నిజంగా అలా ఉండాల్సిన అవసరం లేదు అంటూ క్యాప్షన్ గా రాసుకొచ్చారు. ప్రస్తుతం సమంత పోస్ట్ చేసిన చిట్ చాట్ వీడియో వైరల్ గా మారగా.. సామ్ క్వశ్చన్, క్యాప్షన్.. డాక్టర్ ఆన్సర్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.
సాధారణంగా పిల్లలు కనాలని అనుకునే మహిళల విషయంలో సంతాన సాఫల్యతకు వయసుకు ఏమైనా సంబంధం ఉందా అంటూ సామ్.. డాక్టర్ ను క్వశ్చన్ చేశారు. ప్రతి విషయం కూడా మహిళ వయసు పైనే ఆధారపడి ఉంటుందని అడిగారు. దానికి డాక్టర్ నోజర్ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సంతాన సాఫల్యతకు, వయసుకు సంబంధం ఉందని అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు. అయితే పిల్లల విషయంలో మహిళలను ఒత్తిడికి గురి చేయాల్సిన అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు. మహిళలు తమకు ఎప్పుడు కావాలంటే అప్పుడే పిల్లలను కనాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదో కనాలని కనవొద్దని సూచించారు.
ఆ విషయంలో సైన్స్, వైద్య రంగం, సమాజం వారికి అండగా నిలబడాలని అందరినీ కోరారు. అంతే కాదు.. మహిళ శరీరంలో ఆమె వయసుతో సమానంగా ఉండే కణం బహుశా అండాలు మాత్రమేనని ఆయన చెప్పారు. ఆడవాళ్ల శరీరంలో ఉండే ప్రతి ఇతర కణం ప్రతి కొన్ని నెలలకు క్రమం తప్పకుండా కొత్తగా భర్తీ అవుతుందని తెలిపారు.
అదే సమయంలో పురుషుల కోసం మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పడిపోతోందని నోజర్ తెలిపారు. ఎంచుకుంటున్న జీవనశైలి మార్పుల వల్ల అలా జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం సమంత పోస్ట్ చేసిన వీడియో కింద.. పెళ్లి అయిన కొన్ని రోజులకే ఇలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగారోనని మాట్లాడుకుంటున్నారు. దీనిపై మళ్లీ సామ్ రెస్పాండ్ అవుతారేమో చూడాలి.
