Begin typing your search above and press return to search.

సమంత రెండో పెళ్లి.. బజ్ లేకపోయినా సరికొత్త రికార్డ్..

సమంత.. తమిళ్ చిత్రాల ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.

By:  Madhu Reddy   |   2 Dec 2025 10:57 AM IST
సమంత రెండో పెళ్లి.. బజ్ లేకపోయినా సరికొత్త రికార్డ్..
X

సమంత.. తమిళ్ చిత్రాల ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో జెస్సీ పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్య తో ప్రేమలో పడ్డ ఈమె.. దాదాపు ఏడేళ్ల పాటు రహస్యంగా ప్రేమాయణం సాగించింది.. తర్వాత పెద్దలను ఒప్పించి..పెద్దల సమక్షంలో.. ఇరు కుటుంబ సభ్యుల సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా సాగిన ఈ జంట అనూహ్యంగా 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.

వివాహం అనంతరం ఎన్నో విమర్శలు ఎదుర్కొంది సమంత. అంతేకాదు మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఆ వ్యాధి నుంచి బయటపడడానికి విదేశాలకు వెళ్లి చికిత్స కూడా తీసుకుంది. ఇక సమస్య తీవ్రమవడంతో ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ హిందీ వెబ్ సిరీస్ ల ద్వారా కంబ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ' ఫ్యామిలీ మెన్ - 2' వెబ్ సిరీస్ లో నటిస్తున్నప్పుడే.. ఈ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి.

దీనికి తోడు వీరిద్దరి కాంబినేషన్లో ' సిటాడెల్ - హనీ బన్నీ' అనే వెబ్ సిరీస్ రావడం .. ఆ తర్వాత ఇద్దరు చట్టా పట్టాలేసుకొని తిరగడం, సమంతా పికిల్ బాల్ టోర్నమెంట్ ఆరంభోత్సవంలో సమంత రాజ్ చెయ్యి పట్టుకుని తిరగడం.. విదేశాలకు కలిసి వెళ్లడం.. ఇలా ఎన్నో చేయడంతో ఇక ఇద్దరు ప్రేమలో ఉన్నారని..పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచిన సమంత.. ఎట్టకేలకు డిసెంబర్ 1 సోమవారం కోయంబత్తూర్ ఈషా యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.

పైగా ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.ఈ వివాహ వేడుకను అఫీషియల్ గా ప్రకటిస్తూ తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే.. ఆ జంటలు ఏ రేంజిలో వైరల్ అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎందుకో సమంత రెండో పెళ్లి చేసుకున్నా సరే ఈమె పెళ్లి గురించి పెద్దగా ఎక్కడా మాట్లాడుకోకపోవడం గమనార్హం. అయితే సమంత రెండో పెళ్లిపై బజ్ లేకపోయినా ఇంస్టాగ్రామ్ లో మాత్రం సరికొత్త రికార్డు సృష్టించింది ఈ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా తన పెళ్లి ఫోటోలను అలా షేర్ చేసిందో లేదో ఇలా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసిన 16 గంటల్లోనే దాదాపు 79.5 లక్షల లైక్స్.. 2 లక్షలకు పైగా కామెంట్లు రావడం గమనార్హం. అలా రెండవ పెళ్లితో కూడా ఇంస్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది సమంత - రాజ్ నిడిమోరు జంట. ఇకపోతే ఈ జంటకు ప్రస్తుతం పలువురు సినీ ప్రముఖులు , అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.