Begin typing your search above and press return to search.

సమంత బ్రేక్ అక్క‌డే..ఇక్క‌డ కాదా?

లాంగ్ గ్యాప్ అనంత‌రం స‌మంత ఏ రేంజ్లో కంబ్యాక్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'మా ఇంటి బంగారం' చిత్రంతో గ్రాండ్ గా రీ లాంచ్ అయి అద‌ర‌గొట్టింది.

By:  Srikanth Kontham   |   30 July 2026 12:46 AM IST
సమంత బ్రేక్ అక్క‌డే..ఇక్క‌డ కాదా?
X

లాంగ్ గ్యాప్ అనంత‌రం స‌మంత ఏ రేంజ్లో కంబ్యాక్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'మా ఇంటి బంగారం' చిత్రంతో గ్రాండ్ గా రీ లాంచ్ అయి అద‌ర‌గొట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 100 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లోనే బ్రాండ్ గా మారింది. స‌మంత గ్యాప్ ఇచ్చినా? ఆమె ఇమేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ప్రూవ్ అయింది. ఇదే శుభ సంద‌ర్భంలో స‌మంత గ‌ర్బం దాల్చ‌డం కూడా అంతే సంతోష‌క‌ర‌మైన విష‌యం. ఈనేప‌థ్యంలో సామ్ ఇంకొంత కాలం పాటు విశ్రాంతి తీసుకుంటున్న‌ట్లు తేలిపోయింది.

అయితే ఈ విరామం కేవ‌లం పెద్ద తెర‌కు మాత్ర‌మే బుల్లి తెర‌కు కాదంటోంది. డిజిటల్ ఆడియన్స్‌కు మాత్రం ఎల్లప్పుడూ టచ్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వెండితెరపై కనిపించకపోయినా? ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా హవాను కొనసాగించడానికి సామ్ ప్లాన్ చేస్తున్నారుట‌. ఇందులో భాగంగానే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఓ సరికొత్త రియాలిటీ షో కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చ‌ర్చకొస్తుంది.

ఈ రియాలిటీ షోకు సంబంధించిన కాన్సెప్ట్ చాలా వినూత్నంగా ఉండబోతుందట. ఇప్పటి వరకు సమంతను కేవలం సినిమాల్లో గ్లామర్ పాత్రలలో.. నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లలో మాత్రమే చూసిన అభిమానులకు ఈ షో ద్వారా సామ్ అసలు సిసలు వ్యక్తిత్వం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని టాక్ నడుస్తోంది. సామ్ జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలు, ఫిట్‌నెస్ రహస్యాలు, లైఫ్ స్టైల్‌ను ఈ రియాలిటీ షో ద్వారా అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ మాధ్యమంలో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఉన్న సమంత ఈ షోతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని ర‌కాల ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు పూర్తి వివరాలు వెలువడనున్నాయని సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ షోను అత్యంత భారీ బడ్జెట్‌తో, గ్లోబల్ స్టాండర్స్డ్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా? డిజిటల్ రంగంలో సామ్ చేస్తున్న సాహసోపేతమైన అడుగు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ షో కోసం ఓటీటీ ప్రియులు .. సమంత ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ట్రెండ్‌కు తగినట్లుగా కెరీర్‌ను మలుచుకోవడంలో సమంత ఎప్పుడూ ముందుంటారు. సినిమా థియేటర్లలో తన మ్యాజిక్ చూపించలేకపోయినా? ఇంటింటికీ నేరుగా చేరే ఓటీటీ మాధ్యమం ద్వారా ప్రేక్షకులకు టచ్‌లో ఉండాలనే ఆమె వ్యూహం చాలా ప్రశంసనీయం. నేటి డిజిటల్ యుగంలో స్టార్ హీరోలు ..హీరోయిన్లు కూడా ఓటీటీల వైపు మొగ్గు చూప‌డానికి సమంత తాజా నిర్ణయం చ‌క్క‌ని ఉదాహరణగా నిలుస్తోంది. సినిమాల ఒత్తిడి లేకుండా? తనకు నచ్చిన రీతిలో వినోదాన్ని పంచడానికి సామ్ ఈ వేదికను ఎంచుకోవడం విశేషం.