Begin typing your search above and press return to search.

అటు పూజలు.. ఇటు వర్కౌట్లు.. సామ్ లేటెస్ట్ డంప్!

స్టార్ హీరో సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోస్టులు పెడుతూనే ఉంటారు.

By:  M Prashanth   |   12 Oct 2025 10:00 PM IST
అటు పూజలు.. ఇటు వర్కౌట్లు.. సామ్ లేటెస్ట్ డంప్!
X

స్టార్ హీరో సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోస్టులు పెడుతూనే ఉంటారు. తనకు సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో అవగాహన కల్పిస్తుంటారు. మోటివేషన్ కోట్స్ ను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా కొత్త జర్నీ కూడా స్టార్ట్ చేశారు!

అదే రీసెంట్ గా సమంత.. కొత్తింట్లోకి వెళ్లారు. అందుకు సంబంధించిన పిక్స్ ను పోస్ట్ చేయగా.. అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇటీవల గృహప్రవేశం జరగ్గా.. తాజాగా ఫోటో డంప్ ను షేర్ చేశారు సామ్. అందులో చాలా ఫోటోస్ ఉన్నాయి. ముఖ్యంగా కొత్తింట్లో పూజలు చేస్తున్న పిక్స్ తోపాటు దేవుని మందిరం ఫోటోలు వైరల్ గా మారాయి.

అయితే గృహ ప్రవేశం రోజు సమంత ఎరుపు రంగు డ్రెస్ సాంప్రదాయంగా ముస్తాబై కనిపించారు. ముఖానికి కుంకుమ పెట్టుకుని పూజలో లక్షణంగా ఉన్నారు. తన జిమ్‌ వర్కవుట్స్‌ వీడియోను సామ్ యాడ్ చేయగా.. అందులో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు కనిపించారు. అంతే కాదు.. ముఖం విషయంలో కేర్ కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు.

అదే సమయంలో సామ్ తన లేటెస్ట్ ఫోటో డంప్ కు ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆసక్తి రేపుతోంది. "నేను ఆలోచించే, చెప్పే, చేసే, లక్ష్యంగా పెట్టుకునే ప్రతిదీ నా అత్యున్నత స్వభావాన్ని గౌరవించాలి. నా మౌన సమయంలో నాకు అదే వచ్చింది. ఇప్పుడు, నేను దానిని జీవించగలనని ఆశిస్తున్నాను. కేవలం చెప్పడం కాదు" అంటూ సమంత రాసుకొచ్చారు.

ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే.. మయోసైటిస్ తో ఇబ్బంది పడ్డ తర్వాత వెబ్‌ ప్రపంచంలో అడుగు పెట్టారు. సిటాడెల్ : హానీ బన్ని, రక్త్ బ్రహ్మాండ్ వంటి వెబ్ సిరీస్‌ లో యాక్ట్ చేసి మెప్పించారు. తన వైవిధ్యమైన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు. పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకున్నారు. రీసెంట్ గా నిర్మాతగా శుభం మూవీతో డెబ్యూ ఇచ్చారు.

తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై శుభం చిత్రాన్ని నిర్మించారు. అదే బ్యానర్ లో తాను లీడ్ రోల్ లో మా ఇంటి బంగారం మూవీ చేయనున్నారు. త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నారు. అదే సమయంలో ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌ డమ్‌ హిందీ వెబ్‌ సిరీస్‌ లో యాక్ట్‌ చేస్తున్నారు. త్వరలో ఆ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.