1980 క్రైమ్ థ్రిల్లర్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్?
ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత గత కొంతకాలంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 8 Aug 2025 3:23 PM ISTఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత గత కొంతకాలంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఖుషి తర్వాత సమంత హీరోయిన్ గా మరో సినిమా వచ్చింది లేదు. దీంతో సమంత కొత్త సినిమా అప్డేట్స్ కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతేడాది సమంత బర్త్ డే సందర్భంగా మా ఇంటి బంగారం అనే కొత్త ప్రాజెక్టును సమంత అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
శుభంతో నిర్మాతగా సక్సెస్
సినిమాను అనౌన్స్ అయితే చేసింది కానీ మళ్లీ సమంత దాని గురించి ఎలాంటి అప్డేట్ ఇచ్చింది లేదు. మొన్నటివరకు బాలీవుడ్ పైనే ఫోకస్ చేసిన సమంత ఇప్పుడు తిరిగి టాలీవుడ్ లో బిజీ అవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టి శుభం అనే సినిమాతో నిర్మాతగా మారి ఆ సినిమాతో బాగానే లాభపడింది సమంత.
నందినీ రెడ్డితో మా ఇంటి బంగారం
వాస్తవానికి సమంత శుభం కంటే ముందే మా ఇంటి బంగారంను తన సొంత బ్యానర్ లో అనౌన్స్ చేసింది కానీ ఎందుకో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టును సమంత పూర్తి చేయడానికి వేగంగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తన ఫ్రెండ్ నందినీ రెడ్డి సాయం తీసుకుంటుంది సమంత. జబర్దస్త్, ఓ బేబీ సినిమాల టైమ్ లో సమంత, నందినీ మధ్య మంచి స్నేహం కుదిరింది.
మొన్నామధ్య సమంత హీరోయిన్ గా నందినీ సినిమా చేస్తుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ చేయబోయే సినిమా మా ఇంటి బంగారం అనే తెలుస్తోంది. ఓ బేబీ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లోని క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుందని సమాచారం. వయొలెంట్ జానర్ లో రూపొందనున్న ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లి వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ నాటికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట సమంత, నందినీ రెడ్డి.
