బేబీ బంప్ తో కూల్ గా దర్శనమిచ్చిన సమంత.. లేటెస్ట్ పిక్స్ వైరల్!
సినిమాలతోనే కాకుండా తన అదిరిపోయే ఫ్యాషన్ సెన్స్‌తో కూడా నిరంతరం వార్తల్లో నిలిచే కథానాయిక సమంత రూత్ ప్రభు.
By: Madhu Reddy | 2 Aug 2026 5:49 PM ISTసినిమాలతోనే కాకుండా తన అదిరిపోయే ఫ్యాషన్ సెన్స్‌తో కూడా నిరంతరం వార్తల్లో నిలిచే కథానాయిక సమంత రూత్ ప్రభు. స్టైలిష్ లుక్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిన సమంత, తాజాగా మస్టర్డ్ ఎల్లో కేప్ డ్రెస్‌లో బేబీ బంప్ తో దర్శనమిచ్చి అభిమానులను ఫిదా చేసింది. మినిమలిస్ట్ క్వీన్‌గా పిలువబడే ఈ భామ, తన కొత్త లుక్‌తో మోడ్రన్ అండ్ క్లాసీ స్టైలింగ్ ఎలా ఉండాలో మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..
కేప్ డ్రెస్‌లో రాయల్ లుక్:
సమంత ధరించిన ఈ మస్టర్డ్ ఎల్లో డ్రెస్‌ను ప్రసిద్ధ బ్రాండ్ 'క్వా' డిజైన్ చేసింది. డిఫరెంట్ లుక్‌తో ఉన్న ఈ మిడీ-టు-మాక్సీ డ్రెస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దాని 'కేప్' మోడల్. ఇక చాలా ఫ్రీగా, చూడగానే రాజసం ఉట్టిపడేలా ఉన్న ఈ డ్రెస్ డిజైన్ సమంతకు ఎంతో అందాన్ని ఇచ్చింది.
సమంత వేసుకున్న డ్రెస్ ఎంత అందంగా ఉందో, దానికి మ్యాచ్ చేసిన జ్యువెలరీ కూడా అంతే ఆకట్టుకుంది.ఇక తమన్నా ఫైన్ జ్యువెలరీ నుంచి ఎంచుకున్న టర్కోయిస్ కమ్మలు ఈ మస్టర్డ్ రంగు డ్రెస్‌కు సరైన కాంట్రాస్ట్ కాంబినేషన్‌గా నిలిచాయి. ఇక ఇవి ఆమె లుక్‌కు ఒక ప్రత్యేకమైన మెరుపును అందించాయి.
పర్ఫెక్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైల్:
స్టైలిస్ట్ పల్లవి సింగ్ పర్యవేక్షణలో రూపొందిన ఈ స్టైలింగ్ నిజంగా అద్భుతం. సాఫ్ట్ మేకప్‌తో పాటు వేసుకున్న సింపుల్ అండ్ ఎలిగెంట్ హెయిర్ బన్ ఆమె అందాన్ని మరింత పెంచింది. ఇక ఎక్కడా అతి లేని చాలా సహజమైన, సింపుల్ మేకప్‌తో సమంత అందరినీ కట్టుపడేసింది.
బేబీ బంప్ తో మరింత అందంగా:
తాజాగా సమంత షేర్ చేసిన ఈ ఫోటోలలో ఆమె బేబీ బంప్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బేబీ బంప్ లో సమంత మరింత అందంగా కట్టిపడేస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
సినిమాల్లోనూ అదే స్పీడ్:
కేవలం ఫ్యాషన్ లోనే కాకుండా సినిమాల్లోనూ సమంత తన మార్క్ చూపిస్తోంది. 'సిటాడెల్: హనీ బన్నీ' సిరీస్‌లో 'హనీ'గా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేసి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత తన సొంత బ్యానర్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పై వచ్చిన 'మా ఇంటి బంగారం' చిత్రంలో శక్తివంతమైన పాత్రలో నటించి మెప్పించింది. మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరి ..ఇప్పుడు హాట్ స్టార్ లో స్టీమింగ్ అవుతుంది ..
ఒకవైపు నటనలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూనే, మరోవైపు హై-ఫ్యాషన్ లుక్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తోంది సమంత. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే ఈ భామ, మస్టర్డ్ కేప్ లుక్‌తో మినిమల్ ఫ్యాషన్‌లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. ఈ పిక్స్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
